Gopichand: ప్రభాస్‌కి విలన్‌ అవ్వడానికి గోపీచంద్‌ రెడీ.. అయితే ఒక షరతు!

  • May 6, 2023 / 04:44 PM IST

ప్రభాస్‌ X గోపీచంద్‌… ఈ ఊహే అదిరిపోతుంది. గతంలో ఈ ఇద్దరూ ఎదురుపడినప్పుడు పడ్డ ‘వర్షం’ ఇంకా మనం మరచిపోలేదు. మొన్నీమధ్య రీరిలీజ్‌లో కూడా అదిరిపోయింది. దీంతో ఈ కాంబినేషన్‌ గురించి ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తూనే ఉన్నారు. ఎప్పడెప్పుడూ ఈ ఇద్దరు స్నేహితులు మళ్లీ కలసి కనిపిస్తారా? అని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. సగటు సినిమా ప్రేక్షకుడు కూడా ఇదే మాట అనుకుంటూ ఉంటాడు అనుకోండి. అయితే అలాంటి వాళ్లకు శుభవార్త. మరోసారి కలసి నటించడానికి గోపీచంద్‌ దాదాపు ఓకే చేసేశాడు.

అవును, ‘రామబాణం’ సినిమా ప్రచారంలో భాగంగా మీడియా ముందుకొచ్చిన (Gopichand) గోపీచంద్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వస్తే చేస్తారా? అని అడిగితే యస్‌ చెప్పేశాడు. అయితే చిన్న షరతు కూడా విధించాడు. గతంలో ప్రభాస్‌కు విలన్‌గా నటించాను. అవకాశం వస్తే తప్పకుండా మళ్లీ చేస్తాను. కాకపోతే ఆ పాత్ర ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ సినిమాల్లోని పాత్రల తరహాలో బలంగా ఉండాలి అని అన్నాడు.

నా క్యారెక్టర్ బలంగా ఉండి కథను ఎలివేట్ చేసే విలన్ రోల్స్‌లో నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే అని చెప్పాడు గోపీచంద్‌. ఇండస్ట్రీలో ప్రభాస్, గోపీచంద్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలుసు. ‘వర్షం’ సినిమాతోనే వీళ్ల స్నేహం మొదలైంది అని అంటుంటారు. మరిప్పుడు అదే స్నేహంతో ఇంకో మంచి పాత్ర రాయించి గోపీచంద్‌తో నటించే ప్లాన్‌ ప్రభాస్‌ చేస్తే సరి. ప్రభాస్‌ ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. వాటిల్లో మంచి విలన్‌ పాత్ర ఇస్తే అదిరిపోతుంది.

అలా కాకుండా ఇద్దరూ కలసి ఓ మల్టీస్టారర్‌ చేస్తే ఇంకా హ్యాపీ. మరి ప్రభాస్‌ ఆలోచన ఎలా ఉందో చూడాలి. ఇక గోపీచంద్‌ సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం శ్రీను వైట్ల సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందట. ఆ తర్వాత హర్ష సినిమా ఉంటుంది. అయితే ఇవన్నీ ‘రామబాణం’ ఫలితం మీద ఆధారపడి ఉన్నాయనేది కాదనలేని విషయం.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus