టాలీవుడ్లోకి మరో కొత్త నిర్మాణసంస్థ ఎంట్రీ ఇచ్చింది. ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై కిరణ్ కల్లాకురి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `గ్రే`. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌మదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ద స్పై హూ లవ్డ్ మి అనేది ఉపశీర్షిక. ఈ సినిమా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. మూహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వీఎన్. ఆదిత్య క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విఛ్చాన్ చేశారు. ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల్ స్క్రిప్ట్‌ను అందజేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచిబొట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…
దర్శకుడు రాజ్ మాదిరాజు మాట్లాడుతూ – “రమేష్‌ప్రసాద్‌గారు నాకు దేవుడిలాంటి వ్యక్తి. ప్రతిరోజూ నేను గుర్తు చేసుకునే వ్యక్తి ఆయన. దర్శకులు వీఎన్ ఆదిత్య, లక్ష్మీభూపాల్గార్లు నాకు ఆత్మీయులు. గ్రే అనేది ఒక నెగటివ్ షేడ్ అనే కాదు. ఓ రిలేషన్ షిప్. ఓ రెవల్యూషన్. గ్రే మనలైఫ్‌లో ఉంది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన నీడే ఒక గ్రే. ఇదొక స్పై మూవీ. థ్రిల్లర్. నమ్మలేని అంశాలు ఉంటాయి. తెలియని ఎక్స్‌ప్రెషనే గ్రే. అదే స్క్రీన్ పై కనిపిస్తుంది. క్యాస్టింగ్ కోసం చాలా కష్టపడ్డాను. అలీ, అరవింద్, ఊర్వశీ సెట్ అయ్యారు. ఈ నెల 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబరు కల్లా అన్నీ కార్యక్రమాలను పూర్తి సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అన్నారు.
ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ – “మా నాన్నగారిది పెద్ద ప్రయాణం. ఏటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదిగారు. ప్రసాద్ ప్రొడక్షన్స్‌ను స్థాపించారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. మా తాతగారు రిచ్. కానీ ఆస్తులన్నీ పోయాయి. ఆ తర్వాత మా నాన్నగారు ముంబైలోని ఓ థియేటర్ వద్ద గేట్ కీపర్‌గా చేశారు. 100 రూపాయలతో ముంబై వెళ్లారు. సొంతంగా చాలా విషయాలు నేర్చుకున్నారు. తెలుసుకున్నారు. ఎంతో కష్టపడ్డారు. జీవితంలో ఎదిగారు. ఎంతోమంది హీరోహీరోయిన్లను, ప్రతిభావంతులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నా ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత నాన్నగారి వ్యాపారంలో నేను పాలు పంచుకున్నాను. ల్యాబ్, థియేటర్స్ వర్క్స్‌లో చురుగ్గా పాల్గొన్నాను. దేశంలోనే ఒక దశలో ప్రసాద్ ప్రొడక్షన్స్ టాప్ ప్రొడక్షన్ సంస్థ. నాన్న గారి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. రాజ్ ముదిరాజ్ మంచి ప్రతిభావంతుడు. గ్రే సినిమాకు మంచి క్యాస్టింగ్ కుదిరింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – కొత్త దర్శకులు, కొత్త హీరోహీరోయిన్లు, రచయితలు ఇండస్ట్రీకి వస్తున్నారంటే నాకు పెద్దగా సంతోషం ఉండదు.కానీ నిర్మాతలు వస్తున్నారంటే ఎంతో ఆనందం. వారు సినిమాలు తీస్తుంటేనే కొత్తవారికి అవకాశాలు వస్తుంటాయి. రమేష్‌ప్రసాద్‌గారు ఇండస్ట్రీకి ఒక బ్యాక్‌బోన్. నా వాళ్లిద్దరు మధ్య సినిమాకు కూడా నిర్మాణపరంగా హెల్ప్ చేశారు. గ్రే సినిమాను యూనిక్‌గా చూపిస్తున్నారు. ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశారు. రాజ్ ముదిరాజుగారు పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారు. ఈ సినిమా ఆయన ఇంకా మంచి పేరు తీసుకువస్తుందని నమ్ముతున్నాను. అలీరెజా, అరవింద్ మంచి యాక్టర్స్. అరవింద్‌కు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటు న్నాను. కిరణ్‌గారు ఫ్రెండ్. నిర్మాతలు మంచి నిర్మాణ విలువలతో ఈ సినిమాను తీస్తారని నమ్ముతున్నా.
రచయిత లక్ష్మీభూపాల్ మాట్లాడుతూ – రాజ్ముదిరాజుగారు గ్రే అనే సినిమాను స్టార్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. తెలుగు సినిమాలు డాక్యూమెంటరీగా వస్తున్నాయి. డ్రామా ఉండటం లేదు. కథలు కొన్నే ఉంటాయి. ఎమోషన్స్ అవే. కానీ ఈ కథ నాకు నచ్చింది. ఎందుకంటే టెక్నిక్ బాగుంది. తెలుగు సినిమా నెక్ట్స్ స్థాయికి వెళ్లాల్సింది టెక్నిక్‌లోనే. ఈ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్** అన్నారు.
నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ- రాజ్ముదిరాజుగారు మంచి యాక్టర్, డైరెక్టర్. చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్. అన్నారు
నటుడు అలీ రెజా మాట్లాడుతూ – రమేష్‌గారు చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకం. రెండు రోజులకు ముందు నేను ఓ క్యారెక్టర్ చేయనున్న సినిమా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గ్రే ఓపెనింగ్. మరో రెండు రోజుల్లో తండ్రిని కాబోతున్నాను. అందరి ఆశీస్సుల వల్లే ఇది జరుగుతుంది. రాజ్‌గారితో నేను చేయాల్సిన ఓ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత రాజ్‌గారు గ్రే సినిమా చెప్పారు. కథ బాగా నచ్చింది. ఏడాది తర్వాత కూడ నన్ను గుర్తు పెట్టుకుని అవకాశం ఇచ్చిన రాజ్‌గారికి థ్యాంక్స్. అరవింద్, ఉర్వశీలతో యాక్ట్ చేయడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను.
నటుడు అరవింద్ కృష్ణ మాట్లాడుతూ- గ్రే మంచి మూవీ. ఆడియన్స్‌కు నచ్చుతుంది. అన్నారు
హీరోయిన్ ఊర్వశీ మాట్లాడుతూ – కథ బాగా నచ్చింది. ఎగ్జైటింగ్‌గా అనిపించింది. కాస్త నెర్వస్‌గా ఉంది. నాకు మంచి కో స్టార్స్ దొరికారు. నన్ను నమ్మిన రాజ్ ముదిరాజుగారికి, నిర్మాతలకు ధన్యవాదాలు“ అన్నారు
సహ నిర్మాత శ్రీదేవి మాట్లాడుతూ – ఈ సినిమా నిర్మాత కిరణ్ నా తమ్ముడు. ఈ సినిమాలో భాగమవ్వమన్నప్పుడు కథ విన్నాను. నచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే అనుకుంటున్నాను.
నటి నజియా మాట్లాడుతూ – ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నేను చేస్తున్నతొలి సినిమా ఇది. అన్నారు
నిర్మాత కిరణ్ కల్లాకురి మాట్లాడుతూ – రమేష్ప్రసాద్గారిని కలిసినప్పుడు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఆయన ఇక్కడ ఉండటం ఆనందంగా ఉంది. ఎల్వీ ప్రసాద్‌గారి గురించి మరింత తెలుసుకుంటుంటే చాలా ఆసక్తిగా ఉంది. ఆయన ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఎల్వీ ప్రసాద్‌గారి వారసత్వాన్ని రమేష్‌గారు కొనసాగిస్తున్నారు. ఈ సినిమా కోసం రాజుగారు, రమేష్చదలవాడ చాలా కష్టపడ్డారు. సినిమాకు డబ్బులు పెట్టడం సులువే. కానీ మంచి అవుట్‌పుట్ ఇవ్వడం కష్టం. గ్రే మంచి సినిమా అవుతుందని నమ్ము తున్నాను. థ్రిల్లర్ సినిమాలు పెద్దగా తెలుగులో రాలేదు. గ్రే మంచి థ్రిల్లర్ మూవీ. అన్నారు