Manchu Family: మంచు ఫ్యామిలీపై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగశ్రీను!
February 28, 2022 / 09:34 PM IST
|Follow Us
ఈరోజు ఉదయం నుంచి మంచు విష్ణు ఆఫీస్ లో జరిగిన దొంగతనం గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు మేనేజర్ సంజయ్ 5 లక్షల రూపాయల విలువైన సామాగ్రి పోయిందని చెబుతూ హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీనుపై ఫిర్యాదు చేశారు. తాజాగా సన్ ఆఫ్ ఇండియా ట్రోల్స్ వల్ల మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది. మంచు ఫ్యామిలీ ట్రోల్స్ చేసేవాళ్లపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించడంతో గతంతో పోలిస్తే ట్రోల్స్ తగ్గాయి.
అయితే విష్ణు ఆఫీస్ లో దొంగతనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగశ్రీను తనపై మంచు ఫ్యామిలీ ఉద్దేశపూర్వకంగా దొంగతనం కేసు పెట్టిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనను కులం పేరుతో దూషించారని అందువల్ల తాను ఉద్యోగం మానేశానని నాగశ్రీను చెప్పుకొచ్చారు. తాను ఉద్యోగానికి హాజరు కావడం లేదని కోపంతో తనపై పోలీసులకు దొంగతనం చేశానని ఫిర్యాదు చేశారని నాగశ్రీను కామెంట్లు చేశారు. మోహన్ బాబు తనను అసభ్య పదజాలంతో దూషించారని నాగశ్రీను పేర్కొన్నారు.
సీసీ కెమెరాలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తాను ఎటువంటి దొంగతనం చేయలేదని నాగశ్రీను చెప్పుకొచ్చారు. వైరల్ అవుతున్న వార్తల వల్ల అమ్మ ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని నాగశ్రీను అన్నారు. నాగశ్రీను చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నాగశ్రీను చేసిన కామెంట్లపై మంచు ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. హెయిర్ డ్రెస్సెర్ నాగశ్రీను దొంగతనం కేసులో సంచలన నిజాలను బయటపెట్టారు.
నాగశ్రీను సెల్ఫీ వీడియో ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. మోహన్ బాబు ఫ్యామిలీ అన్న బూతులు తాను చెప్పలేనని ఫిబ్రవరి 17వ తేదీన మోహన్ బాబు నన్ను మోకాళ్లపై కూర్చోబెట్టారని నాగశ్రీను చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసి తనకు న్యాయం చేయాలని నాగశ్రీను కోరారు. నాలాంటి చిన్నవాళ్ల జీవితాలతో ఆడుకోవడం న్యాయం కాదని నాగశ్రీను వెల్లడించారు.