బ్యాగులు, బెల్టులతో ఇంతేసి ఎందుకు ఖర్చుపెడుతున్నారో
January 18, 2021 / 03:11 PM IST
|Follow Us
హీరోయిన్లు దుస్తుల విషయంలో పిసినారితనం చూపిస్తారేమో కానీ… బ్యాగులు, బెల్టుల విషయంలో అస్సలు పిసినారి పనులకు పోరు. చాలామంది హీరోయిన్లు వేలు, లక్షలు విలువ చేసే వస్తువులు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. మొన్నటికిమొన్న సమంత ₹30 వేల విలువైన బెల్టు పెట్టుకొని ‘దిల్ రాజు’ పుట్టిన రోజుకు వచ్చింది. ఇప్పుడు దానికి ఏడింతల ఎక్కువ ధర ఉన్న వస్తువుతో మరో హీరోయిన్ కనిపించింది. అయితే ఈ సారి బెల్టు కాదు… వ్యాలెట్. ఆ హీరోయిన్ హన్సిక.
దక్షిణాదిలో స్టార్ నాయికగా వెలుగొంది, ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ వస్తున్న హన్సిక… మెయింటెనెన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. మొన్నీ మధ్య బయటకు వచ్చిన ఈ అమ్మడు బ్లాక్ జీన్, గ్రే షర్టులో కనిపించింది. అవి చూడటానికి మామూలుగా ఉన్నా.. బ్రాండెడ్ కాబట్టి కాస్త ధర ఎక్కవే ఉండొచ్చు. అయితే విషయం ఆ డ్రెస్ గురించి కాదు… దానికి యాడింగ్ అయిన వ్యాలెట్ గురించి. పింక్ కలర్లో ఉన్న ఆ వ్యాలెట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిజమే ఎందుకంటే దాని ధర సుమారు $2700. అంటే మన కరెన్సీలో సుమారు ₹2 లక్షలు.
ఛానెల్ కంపెనీకి చెందిన ఆ బ్యాగు ధర మార్కెట్లో రేట్ అది మరి. జంతు చర్మం, బంగారం, మెటల్‌తో దానిని తయారు చేస్తారు. అందుకే అంత రేటు అట. ఇలాంటి బ్యాగ్స్‌ను ఆలియా భట్, మౌని రాయ్ లాంటి బాలీవుడ్ నటీమణులు గతంలో ధరించి కనిపించారు. అయితే వాటి ధర సుమారు మూడు లక్షల రూపాయలు. డబ్బు ఉంటే ఖర్చ పెట్టొచ్చు కానీ.. మరీ బ్యాగు కోసం రెండేసి లక్షల రూపాయాలు పెట్టాలా? అనేది ఇక్కడ ప్రశ్న.