పోస్టర్స్ తో రచ్చ చేస్తున్న మిల్క్ వైట్ బ్యూటీ హన్సిక

  • January 2, 2019 / 01:14 PM IST

మరి స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం లేదని హర్ట్ అయ్యిందో లేక అసలు మంచి అవకాశాలే రావడం లేదని ఫీల్ అయ్యిందో తెలియదు కానీ.. ఈమధ్య వరుసబెట్టి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేస్తోంది హన్సిక. ఈ బబ్లీ బ్యూటీ చిన్న వయసులోనే పెద్దదైపోవడం వల్ల.. ఆల్రెడీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోని స్టార్ హీరోలందరితోనూ రొమాన్స్ చేసేసింది. దాంతో.. సీనియర్ హీరోలు ఆమెను రిపీట్ చేయడానికి ఇష్టపడడం లేదు, జూనియర్స్ ఏమో పట్టించుకోవడం లేదు. దాంతో అమ్మడు అందరు సీనియర్ హీరోయిన్స్ లాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటుపోతోంది.

ఆ తరహా సినిమాలు చేయడంలో తప్పు లేదు కానీ.. ఆ సినిమాల ఎనౌన్స్ మెంట్ కోసం రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నాయి. మొన్నమధ్య విడుదలైన చేసిన ఓ పోస్టర్ లో స్వామీజీలా తయారైన హన్సిక పోస్టర్ పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఆ గొడవ ఇంకా సర్ధుమణుగక ముందే తన తాజా చిత్రం “మహా” పోస్టర్ ను రిలీజ్ చేసింది హన్సిక. బాత్ టబ్ లో రక్తం నింపుకొని ఆ రక్తంలో గన్ పట్టుకొని కూర్చున్న హన్సిక స్టిల్ బాగా వైరల్ అయ్యింది. మరి ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఉన్న మేటర్ సినిమాలో ఉంటుందా లేదా అనేది తెలియదు కానీ.. హన్సిక ఫ్యాన్స్ అందరూ ఏంటి హన్సిక ఈ రచ్చ అంటూ గగ్గోలపెడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus