Pushpa 2: పుష్ప ది రైజ్ విషయంలో జరిగిన తప్పు పుష్ప2 విషయంలో జరగట్లేదా?
May 20, 2024 / 02:08 PM IST
|Follow Us
బన్నీ (Allu Arjun) సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ (Pushpa) సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అప్పట్లో స్ట్రీమింగ్ కావడం గమనార్హం. ఈ సినిమా ఓటీటీలో ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే పుష్ప ది రైజ్ త్వరగానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయినా పుష్ప ది రూల్ (Pushpa 2) మూవీ మాత్రం ఒకింత ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా హనుమాన్ (Hanu Man) మూవీ 60 రోజుల తర్వాత ఓటీటీలో ఏ విధంగా స్ట్రీమింగ్ అయిందో పుష్ప ది రూల్ కూడా అదే విధంగా ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది. ఓటీటీ డీల్ కు సంబంధించి పుష్ప ది రైజ్ విషయంలో జరిగిన తప్పు పుష్ప2 విషయంలో జరగట్లేదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కు మరో మూడు నెలల సమయం ఉండగా దసరా పండుగ తర్వాతే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ బిజినెస్ పరంగా కూడా టాప్ లో ఉంది. హిందీ రైట్స్ విషయంలో ఈ సినిమాదే రికార్డ్ అని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పుష్ప ది రూల్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ లో బన్నీ లుక్ కూడా కొత్తగా ఉందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ యాక్షన్ సీన్స్, యాక్టింగ్ స్కిల్స్ తో కూడా ప్రేక్షకులను మెప్పించారు. బన్నీ కెరీర్ పరంగా రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో విజయాలను సాధిస్తారో చూడాలి. పుష్ప ది రూల్ తో బన్నీ హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.