హాస్పిటల్ లో ‘హనుమాన్ జంక్షన్’ హీరోయిన్..!

  • February 25, 2019 / 03:49 PM IST

ఒకప్పటి కన్నడ స్టార్ హీరోయిన్ విజయలక్ష్మి ప్రస్తుతం ఆరోగ్యం బాలేకపోవడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఒకప్పుడు మంచి స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఈమె… మొదట తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన సంపాదించిన డబ్బు మొత్తం తన తల్లి చికిత్స కోసం పెట్టేసింది. తరువాత విజయ లక్ష్మి ఆరోగ్యం కూడా క్షీణించడంతో… ప్రస్తుతం బెంగుళూర్ ఆసుపత్రిలో చిక్కిట్స్ పొందుతుంది.

అయితే విజయలక్ష్మి ట్రీట్మెంట్ సరిపడా డబ్బు వారి దగ్గర సరిపొవట్లేదని… ఆమె సోదరి ఉషాదేవి కోరడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. గతంలో సౌత్ సినిమాల్లోనూ… సీరియల్స్ లోనూ ఈమె నటించింది. ‘నాగమండల’ ‘నంబర్‌ ఇన్‌’ ‘సూర్యవంశ’ వంటి చిత్రాలతో కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయలక్ష్మి… తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమే. అర్జున్ – జగపతి బాబు కలిసి నటించిన ‘హనుమాన్ జంక్షన్’ చిత్రంలో హీరో వేణుకి లవర్ గా నటించింది. ఇక ఆ చిత్రం తరువాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. బి.పి పెరగడం… వంటి ఇతర అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆసుపత్రి పాలయ్యింది విజయలక్ష్మి. ఇప్పటికే కొందరు కన్నడ నటీ నటులు ముందుకు వచ్చి ఆర్ధిక సాయం చేశారట. మరి తొందర్లోనే విజయలక్ష్మి కోలుకోవాలని ఆశిద్దాం..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus