పహిల్వాన్ తో పలు భాషల్లోకి అడుగిడుతున్న సుదీప్!

  • September 2, 2019 / 01:15 PM IST

యాక్షన్ సీన్స్ లో ఇంటెన్సిటీని వీర లేవల్లో పండించగల నటుల్లో ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముందుంటారు. అటువంటి అమితాబ్ కూడా ఆశ్చర్యపోయేలా చేసిన నటుడు కిచ్చా సుదీప్. సుదీప్ నటించిన ఓ కన్నడ చిత్రాన్ని చూసిన అమితాబ్.. “నీ కళ్ళల్లో నాకంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంది” అని కితాబు ఇవ్వడమే కాక.. బాలీవుడ్ కి సుదీప్ ను ఘనంగా పరిచయం చేశారు అమితాబ్ బచ్చన్. ఆ తర్వాత సుదీప్ మన రాజమౌళి కళ్ళల్లో పడడం “ఈగ” సినిమాలో విలన్ గా తన నట విశ్వరూపాన్ని చూపడం, తెలుగులోనూ విశేషమైన గుర్తింపు, మార్కెట్ ను సంపాదించుకోవడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సుదీప్ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్. అలాగే.. కన్నడలోనూ తిరుగులేని సూపర్ స్టార్. “సైరా నరసింహారెడ్డి” చిత్రంలోనూ సుదీప్ ఓ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కంటే ముందు “పహిల్వాన్”గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సన్నద్ధమవుతున్నాడు సుదీప్. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ డబ్బింగ్ రూపంలో విడుదలకానుంది.

ఇలా సినిమాలతో తన నటన వల్ల మాత్రమే ఆయన సూపర్ స్టార్ అయిపోలేదు.. ఎంత అద్భుతమైన నటుడో.. అంతకంటే మంచి వ్యక్తి సుదీప్. ఆయన ప్రపంచానికి తెలిసేలా చేసే సహాయాల కంటే ఎవరికీ తెలియకుండా అవసరార్ధులను ఆదుకొన్న సందర్భాలే ఎక్కువ. అందుకే సెప్టెంబర్ 2 (ఆయన జన్మదినం)ను కన్నడ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వేడుకలా జరుపుకొంటారు అభిమానులు. ఈ ఏడాది నుంచి సుదీప్ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించనుంది. పహిల్వాన్ తో ఆయన సూపర్ హిట్ కొట్టాలని, మరిన్ని తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus