Happy Ending Review in Telugu: హ్యాపీ ఎండింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 3, 2024 / 07:28 AM IST

Cast & Crew

  • యష్‌ పూరి (Hero)
  • అపూర్వరావ్‌ (Heroine)
  • అజయ్ ఘోష్, విష్ణు ఓయ్ , ఝాన్సీ , అనితా చౌదరి , హర్ష రోషన్ (Cast)
  • కౌశిక్‌ భీమిడి (Director)
  • యోగేశ్‌ కుమార్‌ , సంజయ్‌రెడ్డి , అనిల్‌ పల్లాల (Producer)
  • రవి నిడమర్తి (Music)
  • అశోక్ సీపల్లి (Cinematography)

చిన్న సినిమాలు విరివిగా విడుదలవుతున్న తరుణం ఇది. ఈవారం ఏకంగా ఏడెనిమిది సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి “హ్యాపీ ఎండింగ్”. యష్ పూరీ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ & కాన్సెప్ట్ ఓ మోస్తరు ఆసక్తి నెలకొల్పాయి. మరి సినిమా ఏ స్థాయిలో ఉందో చూద్దాం..!!

కథ: చిన్నప్పుడు మేనక థియేటర్లో తెలియక చేసిన ఒక తప్పు వల్ల.. బాబా (అజయ్ ఘోష్) ఊహించని విధంగా హర్ష్ (యష్ పూరీ)ని శపిస్తాడు. అప్పట్నుండి హర్ష్ ఎవరినైతే రోమాంటిక్ గా ఊహించుకుంటాడో వాళ్ళు చనిపోతుంటారు. అందుకని ప్రేమ, పెళ్లి అనేవాటి గురించి ఆలోచించకుండా.. మ్యాకప్ మేన్ గా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు.

కట్ చేస్తే.. అవ్ని (అపూర్వ రావు)తో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం గట్రా జరిగిపోతాయి. అప్పట్నుంది ఎక్కడ సంసారం చేస్తే తన భార్య చచ్చిపోతుందో అని భయపడుతూ ఉంటాడు. అందువల్ల.. పర్సనల్ లైఫ్ & ప్రొఫెషనల్ లైఫ్ లోనూ చాలా డిస్టర్బ్ అవుతాడు.

అసలు బాబా ఇచ్చిన శాపం నిజంగానే పని చేస్తుందా? హర్ష్ ఆ శాపం నుండి విముక్తి ఎలా లభించింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట.

నటీనటుల పనితీరు: హర్ష్ పాత్రలో యష్ పూరీ స్టైలిష్ గా కనిపించాడు కానీ.. నటుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. తన ఫిట్ నెస్ లెవెల్స్ తెరపై చాలా బాగా చూపించుకున్న యష్ పూరీ.. యాక్టింగ్ స్కిల్స్ మాత్రం కనీస స్థాయిలో కూడా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయాడు.

అవని అనే మెచ్యూర్డ్ & ఇండిపెండెంట్ అమ్మాయి పాత్రలో అపూర్వ రావు ఆకట్టుకుంది. హావభావాల ప్రకటనలో ఇంకాస్త మెరుగుపడాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా పర్వాలేదనిపించుకుంది.

విష్ణు ఓయ్ కామెడీ పండించడానికి ప్రయత్నించినప్పటికీ.. సరైన స్థాయి రైటింగ్ లేనందువలన, అది సరిగా వర్కవుటవ్వలేదు. అజయ్ ఘోష్, ఝాన్సీ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ఒక సింపుల్ పాయింట్ తో ఎంగేజింగ్ గా సినిమాని తెరకెక్కించడం అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు మేకర్స్ ఫాలో అవుతున్న టెక్నిక్. ఈ టెక్నిక్ ను దర్శకుడు కౌశిక్ పూర్తిగా అర్ధం చేసుకోలేదని సినిమా మొదలైన 30 నిమిషాలకు అర్ధమైపోతుంది. “గుడ్ లక్ చక్” అనే హాలీవుడ్ సినిమా థీమ్ ను తలపించే ఈ కథను ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే రీతిలో తెరకెక్కించడంలో కౌశిక్ విఫలమయ్యాడు. అలాగే.. క్యారెక్టర్ ఆర్క్స్, స్క్రీన్ ప్లే వంటి విషయాల్లో కనీస స్థాయి జాగ్రత్త వహించలేదు. ఈ తరహా అడల్ట్ కామెడీని మేర్లపాక గాంధీ “ఏక్ మినీ కథ”లో బాగా వర్కవుట్ చేశాడు. పైగా.. సీన్ కంపోజిషన్స్ & షాట్ డివిజన్స్ చూశాక “మోడ్రన్ సినిమా” అనుకోని ఏవో పిచ్చి ప్రయత్నాలు చేసినట్లు అనిపిస్తుంది కానీ.. ఎక్కడా కొత్తగా కనిపించదు.

సంభాషణలు, సంగీతం ఈ సినిమాకి పెద్ద మైనస్. ప్రాసల కోసం ప్రాకులాడిన సంభాషణలు బోరు కొట్టిస్తాయి. ఇక.. రెట్రో స్టైల్లో వివేక్ సాగర్ తరహాలో ప్రయత్నించిన సాంగ్స్ చిరాకు పెట్టిస్తాయి.
కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ మాత్రం డీసెంట్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో మేకర్స్ పడిన జాగ్రత్త కొన్నిచోట్ల ముచ్చటేసింది. ఉదాహరణకి పెళ్లి సెట్ లేకుండా చుక్కలు చూపించి పెళ్లి అయిపోయింది అని చూపించే సీన్ ఎగ్జిక్యూషన్ బాగుంది. కానీ.. కొన్నిచోట్ల ఈ అతితెలివి సరిగా వర్కవుతవ్వలేదు.

విశ్లేషణ: కాన్సెప్ట్ కి, డీలింగ్ కి, సన్నివేశాలకి ఏమాత్రం సింక్ లేని సినిమా “హ్యాపీ ఎండింగ్”. ఇకనైనా యువ దర్శకులు మోడ్రన్ సినిమా పేరిట.. ఏది పడితే అది జనాల మీద రుద్ధడం ఆపేస్తే బెటర్!

రేటింగ్: 1/5

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus