పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే న్యూస్..!

  • January 24, 2023 / 12:10 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ పక్క రాజకీయాల్లో భాగంగా తన జనసేన పార్టీ తరఫున పాదయాత్రలు వంటివి చేస్తూనే మరోపక్క సినిమా షూటింగ్లలో కూడా పాల్గొంటున్నారు. గతేడాది ‘భీమ్లా నాయక్’ తో అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్.. త్వరలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రాత్మక చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. 2020 ప్రారంభమైన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది.

2023 కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అది కన్ఫర్మ్ అని అయితే నిర్మాత ఎ.ఎం.రత్నం చెప్పలేదు. సినిమా పూర్తయ్యి.. అంతా బాగా వస్తే రిలీజ్ డేట్ చేస్తానని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇది పీరియాడికల్ మూవీ కాబట్టి… ‘హరిహర వీరమల్లు’ కి భారీ భారీ సెట్స్ వేస్తున్నారట. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కోసం వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా ఎక్కువ అవసరం పడుతుంది అని ఆయన చెప్పడం జరిగింది.

గ్లింప్స్ కు వచ్చిన ఆదరణ అందరం చూశాం. ఇక టీజర్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి 26న ‘హరిహర వీరమల్లు’ టీజర్ విడుదల చేస్తామంటూ నిర్మాత ఏ.ఎం.రత్నం ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ,హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తామని కూడా నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ఆదిత్య మీనన్, బాబీ డియోల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus