Pawan Kalyan: మేజర్ యాక్షన్ సీన్ పూర్తి చేసిన పవన్!

  • December 22, 2022 / 12:44 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఆయన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాల్సివుంది. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సింది కానీ పవన్ రాజకీయాల పరంగా బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నం కాస్త ఇబ్బంది పడ్డారు. కొన్నేళ్లుగా వారు ఈ ప్రాజెక్ట్ కి అంకితమై ఉన్నారు.

దీంతో ఖర్చు విపరీతంగా పెరిగిపోతుండడంతో నిర్మాతల్లో టెన్షన్ పెరుగుతోంది. చాలా సార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా ఫైనల్ గా 2023 వేసవికి రావాలని ఫిక్స్ అయింది. కానీ పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే అప్పటికైనా సినిమా రిలీజ్ అవుతుందా..? అనే సందేహాలు కలిగాయి. కానీ ‘హరిహర వీరమల్లు’ టెన్షన్ తీరుస్తూ.. పవన్ కళ్యాణ్ కంటిన్యూస్ గా షూటింగ్ కి హాజరవుతున్నారు. చాలా నెలల తరువాత పవన్ కళ్యాణ్ గ్యాప్ ఇవ్వకుండా దాదాపు రెండు వారాలు రెగ్యులర్ గా షూటింగ్ కి వచ్చారట.

రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్స్, పెద్ద సంఖ్యలో ఆర్టిస్ట్ లు, వేలమంది జూనియర్ ఆర్టిస్ట్ ల కాంబినేషన్ లో కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఎలాంటి బ్రేక్ తీసుకోకపోవడంతో సినిమాకి సంబంధించిన మేజర్ పార్ట్ పూర్తయినట్లు సమాచారం. షెడ్యూల్ మొదలయ్యే ముందు నెలకొన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. పవన్ కళ్యాణ్ వరుసగా షూటింగ్ కి రావడం చిత్రబృందంలో హుషారు తెచ్చినట్లు సమాచారం.

ఇలా మరో మూడు వారాల పాటు పవన్ కళ్యాణ్ కాల్షీట్స్ కేటాయించగలిగితే సినిమా పూర్తయిపోతుందని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి ఆ తరువాత హరీష్ శంకర్ సినిమాను కూడా పూర్తి చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. సుజీత్ సినిమా కూడా లైన్ లో ఉంది. ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో చూడాలి!

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus