బిగ్ బాస్ 4: సీక్రెట్ టాస్క్ లో దుమ్మురేపుతోంది..!

  • November 5, 2020 / 11:07 AM IST

పల్లెకి పోదాం ఛలో.. ఛలో.. అనే టాస్క్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తోంది. ఇందులో హారికకి ఒక సీక్రట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పల్లెటూర్లో ఉంటూ పుకార్లు పుట్టించేలా పిల్లలా హారిక క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. అంతేకాదు, పాన్ షాప్ యజామాని తమ్ముడు అయిన మెహబూబ్ ని ప్రేమిస్తుంది. ఊర్లో ఉన్న అబ్బాయిలందర్నీ ఆటపట్టిస్తుంది. వేరేవాళ్ల పనుల్లో సహాయం కూడా చేస్తుంది. ఇక్కడే బిగ్ బాస్ సీక్రట్ టాస్క్ కూడా ఇచ్చాడు.

హారిక హంతకురాలిగా మారి మూడు హత్యలు చేయాలి. అది కూడా బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ చేసిన ప్రతిసారి చేయాలి. ఆర్డర్ కూడా మిస్ అవ్వకూడదు. నెంబర్ 1. రాజశేఖర్ పై కాఫీ చల్లాలి 2. అవినాష్ కి కోపం తెప్పించి అరిచేలా చేయాలి. 3. ఏదైనా విండోపైన చంపాలనుకున్న వ్యక్తి పేరు లిప్ స్టిక్ తో రాయాలి. ఇది చేస్తే హారికకి ప్రత్యేమైన పవర్ వస్తుంది.

ఇక్కడ అమ్మరాజశేఖర్ కష్టపడి పనిచేసే గ్రామస్తుడి పాత్రలో ఉన్నారు. పాన్ డబ్బ దగ్గర కట్టెలకోసం ప్రయత్నిస్తుంటే చాలా తెలివిగా ఆయన వెనకాలే వెళ్లి హారిక కాఫీచల్లేసింది. ఆ తర్వాత సారీ చెప్తూ తుడిచింది. ఏమాత్రం ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ పని చేసింది హారిక. తర్వాత అవినాష్ పాన్ డబ్బ యజమాని క్యారెక్టర్ లో ఉన్నాడు. అతనికి కోపం తెప్పించాలి. అలాగే ఎవరిని చంపాలి అనుకుంటోందో వాళ్ల పేరు ఏదైనా ఒక విండోపై రాయాలి. ఇవి చేస్తే హారిక సక్సెస్ అయినట్లే. ఇక్కడ హారికకి ఇచ్చి పాత్రలో కూడా ఇన్వాల్ అయ్యి దుమ్మురేపుతోంది. ఈవారం నామినేషన్స్ లో ఉంది కాబట్టి మరి ఈటాస్క్ హారికకి ఎలా ప్లస్ అవుతుంది అనేది చూడాలి.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus