బిగ్‌బాస్ హౌస్‌లో ఈ రోజు డ్యాన్సింగ్ ఫండా ఏర్పాటు చేశారు. టీమ్ మెంబర్స్ జోడీలుగా విడిపోయి మాస్ పాటలకు డ్యాన్స్‌లు వేశారు. ఎవరికి వారు బిగ్‌బాస్ మనసును గెలుచుకోవాలని తెగ ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో అఖిల్ మనసు గాయపడిందా? ఏమో ప్రోమోలు చూస్తుంటే ఔననే అనిపిపిస్తోంది. మోనాల్, సోహైల్ జోడీ రూమ్‌లో రిహార్సల్ చేస్తుంటే అఖిల్ చాలా సీరియస్‌గా కనిపించాడు. మోనాల్ – సోహైల్ కలసి ‘వానా వానా వెల్లువాయి…’ పాటకు డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. డ్యాన్స్ వేస్తున్నంతసేపు అఖిల్ మోనాల్ వైపు సీరియస్ చూడటం గత ప్రోమోలోనే చూశాం. మరి రిహార్సిల్ టైమ్‌లో అఖిల్ ఏం చేశాడనేది ఇప్పుడు తెలిసింది.
ఇంట్లో మోనాల్, సోహైల్ డ్యాన్స్ చేస్తుంటే… అఖిల్ ఆ పక్కనే బెడ్ మీద కూర్చొని సీరియస్‌గా ఉన్నాడు. ఈ విషయాన్ని సుజాత, అభిజీత్ కూడా గమనించాడు. ఇప్పటివరకు అభిజీత్ అంటే పడని అఖిల్… సోహైల్ మీద కూడా కోపం పెంచుకుంటాడేమో చూడాలి. ఇక మరో పాటలో రౌడీబేబీ హరిక, దిల్సే మెహబూబ్ ‘రాయే రాయే నా రాకాసి’ పాటకు మాస్ స్టెప్పులేశారు. మామూలుగానే మెహబూబ్ సూపర్ డ్యాన్సర్. హారిక ఎంత గ్రేస్‌తో డ్యాన్స్ వేస్తుందో నిన్న మార్నింగ్ మస్తీలో చూశాం.
అలాంటి ఇద్దరు కలిస్తే ఏమవుతుందో ఈ రోజు ఎపిసోడ్లో చూడాలి. ఈ రోజు అమ్మ రాజశేఖర్ మాస్టర్ డ్యాన్స్ కూడా ఉన్న విష్రం తెలిసిందే. ఆరియానా కూడా డ్యాన్స్ వేసినట్లు తెలుస్తోంది. అది ఎవరితో అనేదే చూడాలి. అన్నట్లు ఈ డ్యాన్స్ షోకి జడ్జీలుగా నోయల్, లాస్య ఉన్నారు. నోయల్ అయితే హాట్ హాట్ అంటూ గోల చేస్తున్నాడు.. ఎందుకోమరి.