రూ.3 కోట్ల సినిమా తీసినా రూ.300 కోట్ల సినిమా తీసినా.. అది మర్చిపోకూడదు: హరీష్ శంకర్

  • March 11, 2023 / 02:19 PM IST

మొన్నీమధ్యనే వెంకటేష్ మహా.. ‘కె.జి.ఎఫ్’ సినిమా గురించి రాఖీ బాయ్ పాత్ర గురించి ఇష్టమొచ్చిన కామెంట్లు చేశాడు. ఆ సినిమాలో హీరో నీచ్ కమీనే కుత్తే అని… లాస్ట్ లో బంగారం తీసుకెళ్లి సముద్రంలో పడేసి.. జనాలకు మాత్రం ఇందిరమ్మ పథకంలో ఇళ్ళు ఇచ్చి సరిపెట్టాడని ఇలా ఇష్టమొచ్చిన కామెంట్లు చేశాడు. దీంతో అతని పై ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలో అతను సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు. అది కూడా తాను వాడిన పదజాలం తప్పు కానీ భావం తప్పు కాదు అంటూ సమర్ధించుకున్నాడు.

అక్కడితో ఆగిపోతే పర్వాలేదు కానీ పెద్ద సినిమాలను ఆదరించినట్టే చిన్న సినిమాలను కూడా ఆదరించాలని అతను చెప్పడం ఇంకా పెద్ద దుమారాన్నే రేపింది. సినిమా చరిత్రలో తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమాలు, క్లాస్ సినిమాలు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు అయిన సందర్భాలు ఉన్నాయి. ‘మంచి సినిమా ఇది’ అనే టాక్ వస్తే ప్రేక్షకుల ఆ సినిమా బడ్జెట్ ఏంటి?, నటీనటులు ఎవరు అనే ఆలోచనలు లేకుండా థియేటర్ కి వెళ్లి సినిమాలు చూస్తున్నారు.

వెంకటేష్ మహాకి అర్ధం కాని ఇలాంటి విషయాలను తాజాగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ‘బలగం’ సక్సెస్ మీట్ లో అర్థమయ్యే విధంగా చెప్పుకొచ్చాడు. “కొద్దిరోజులుగా పెద్ద సినిమా చిన్న సినిమా.. క్లాస్ సినిమా మాస్ సినిమా అనే డిబేట్ నడుస్తుంది. నిజానికి పెద్ద సినిమా.. చిన్న సినిమా అనే ఆలోచన జనాలకు ఉండదు. మంచి సినిమానా కాదా? అనే ఆలోచనతో మాత్రమే వాళ్ళు సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్తారు.

‘సాగర సంగమం’ ‘శంకరాభరణం’ వంటి సినిమాలు చూడ్డానికి కూడా జనాలు బండ్లు కట్టుకుని థియేటర్ కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కమర్షియల్ సినిమా అనే మాట మనం అలవాటు చేసుకున్నాం అంతే..! ‘సాగర సంగమం’ లో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో ఇన్ని రకాల డాన్స్ ల గురించి హీరో చెబుతుంటే అందులో కూడా ఎలివేషన్స్ కనిపించాయి. మాస్ సినిమాలోలానే అందులో కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంది. మంచి చిన్న సినిమా వస్తే దాన్ని భుజాల మీద వేసుకుని ప్రమోట్ చేసేది మాస్, కమర్షియల్ సినిమాలు తీసే పెద్ద డైరెక్టర్లే..!

పెరుగన్నం తినేవాళ్లు పెరుగన్నం తింటారు.. బిర్యానీ తినే వాళ్ళు బిర్యానీ తింటారు. కానీ మనం బిర్యానీ తిన్నాక.. పెరుగన్నం కూడా తినండి ఇది బాగుంటుంది అని చెప్పి తినిపించాలి. రూ.3 కోట్ల సినిమా తీసినా రూ.300 కోట్ల సినిమా తీసినా.. మనం చెప్పాలనుకున్న పాయింట్ నిజాయితీగా చెప్పాలి” అంటూ హరీష్ శంకర్ పరోక్షంగా దర్శకుడు వెంకటేష్ మహాకి సున్నితంగా క్లాస్ పీకాడు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus