మామూలుగా అయితే దర్శకుడు చెప్పిందే ఓ సినిమాకు సంబంధించినంతవరకు ఫైనల్. ఇందులో ఎవరికీ ఎలాంటి డౌట్ ఉండదు. ఎందుకంటే ఆయన కెప్టెన్ ఆఫ్ ది షిప్ మరి. అయితే ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమాలో దర్శకుడికి నచ్చకుండా, ఓకే అవ్వకుండా ఓ స్టెప్ వచ్చేసిందా? ఏమో దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది మరి. ఓ పాట విషయంలో వస్తున్న ట్రోల్స్ గురించి ఆయన స్పందన అలా ఉంది మరి. ఇంతకీ ఏమైందంటే?
‘మిస్టర్ బచ్చన్’ ఈ నెల 15న విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా ఫలితం నచ్చనివాళ్లు కాస్త పీక్స్‌కి వెళ్లి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు కూడా. వాళ్లు అంతలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం.. సినిమా రిలీజ్‌కు ముందు ఆ సినిమా టీమ్ సోషల్ మీడియాలో, బయట అదే స్థాయిలో హడావుడి చేశారు. ఆ విషయం పక్కన పెడితే.. సినిమాలోని ఓ పాటలో హీరోయిన్ నడుము దగ్గర చీరను పట్టుకుని ఓ స్టెప్పేస్తాడు. దాని గురించి ఈ చర్చ అంతా.
సినిమా చూసినవాళ్లకు ఆ పాటేంటి, ఆ స్టెప్పేంటి అనేది తెలిసిన విషయమే. గతంలో కొన్ని సినిమాల్లో ఇలాంటి స్టెప్పులు ఉన్నాయనుకోండి. అయితే ఈ సినిమా విషయంలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టెప్పులు చూడటానికి ఎబ్బెట్టుగా ఉన్నాయని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై హరీష్ శంకర్ తన వివరణ ఇచ్చుకున్నారు. ఆ డ్యాన్స్ మూమెంట్స్ తనకు కూడా అంతగా నచ్చలేదని చెప్పారు.
శేఖర్ మాస్టర్ మొదటి రోజే అలా స్టెప్పులు కంపోజ్ చేయడం.. తనకు నచ్చలేదని అయితే, ఆ విషయం చెబితే ఎక్కడ వర్క్ విషయంలో లో అవుతారో అనుకుని ఊరుకున్నాను అని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. అయితే.. దర్శకుడిగా తుది నిర్ణయం తనదే కాబట్టి.. తర్వాత అయినా వాటిని మార్చుకోవచ్చు కదా అనే చర్చ మొదలైంది. మరి దీనికి హరీశ్ ఏమంటారో?