కిమ్ శర్మ… నేను అందుకే విడిపోయాం : హర్షవర్ధన్ రాణే
October 30, 2020 / 05:23 PM IST
|Follow Us
‘తకిట తకిట’ ‘నా ఇష్టం’ ‘అవును’ ‘అవును2’ ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ‘బెంగాల్ టైగర్’.. వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హర్షవర్ధన్ రాణే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిజానికి ఇతను నార్త్ కు చెందిన నటుడే అయినప్పటికీ.. తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కరోనా భారిన పడిన సినీ నటులలో ఇతను కూడా ఒకడు. అయితే త్వరగానే కోలుకున్నాడు లెండి. ఇదిలా ఉండగా.. హర్షవర్ధన్ గతంలో నటి కిమ్ శర్మతో రిలేషన్లో ఉండేవాడన్న సంగతి అందరికీ తెలిసిందే.కిమ్ శర్మ కూడా తెలుగులో ‘ఖడ్గం’, ‘మగధీర’ ‘ఆంజనేయులు’ ‘యాగం’ వంటి చిత్రాల్లో నటించింది.
2010లో ఈమె మొదట ప్రముఖ బిజినెస్మెన్ అయిన అలీ పుంజానీని వివాహం చేసుకుంది. తరువాత వీరిమధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అప్పటి నుండీ హర్షవర్ధన్ రాణే తో రిలేషన్ షిప్ లో ఉంటూ వచ్చింది కిమ్ శర్మ. కానీ ఇతనితో కూడా ఈమె బ్రేకప్ చెప్పేసింది. దానికి గల కారణాలు ఏంటన్నది ఇప్పటి వరకూ ఆమె బయటపెట్టలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్.. కిమ్‌తో ఎందుకు బ్రేకప్ అయ్యింది వివరించాడు.అతను మాట్లాడుతూ.. “ఈ విషయంలో పెద్ద రహస్యమేమీ లేదు.
కిమ్, నేను కొన్నాళ్లపాటు రిలేషన్లో ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ బంధం లేదు. ఆమె బిహేవియర్ అలాగే ఆలోచనా విధానం.. ఆమె నుండీ నన్ను దూరం పెట్టాయి. కిమ్‌తో నాకు మంచి ఙ్ఞాపకాలే ఉన్నాయి. ఆమెకు మంచి సెన్సాఫ్ – హ్యూమర్ ఉంది. నేననుకోవడం నా డీ.ఎన్.ఏలోనే ఏదో తప్పు జరిగి ఉంటుంది. లేకపోతే ఏ కారణం లేకుండా ఎవ్వరూ విడిపోరు కదా. 12 ఏళ్ల పాటు నేను ఒంటరిగానే ఉన్నాను అని రాణే వివరించారు.