Bigg Boss 5 Telugu: సిరి చేసిన పనే సన్నీ కి ఆవేశం తెప్పించిందా..?
November 12, 2021 / 02:22 PM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ కంటే కూడా షణ్ముక్ అరవడమే ఎక్కువ మజాని ఇచ్చింది. ఇంతకాలం సైలెంట్ గా ఉండి ఎదుటివారిని రెచ్చగొట్టిన షణ్ముక్ జస్వంత్ ఫస్ట్ టైమ్ ట్రిగ్గర్ అయ్యి, సన్నీపై అరిచాడు. నిజానికి కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ, రవి, సిరి ఇంకా కాజల్ నలుగురు పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి సంబంధించిన సపోర్టర్స్ వారి టవర్స్ ని కాపాడాల్సి ఉంటుంది. ఇక్కడే సన్నీ తన టవర్ ని బాల్స్ తో కొడుతుంటే సన్నీని ఆపే ప్రయత్నం చేసింది సిరి. సన్నీ సిరిపై ధ్వజమెత్తాడు. గేమ్ లో తంతాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు అప్పడం అయిపోతావ్ అనేసరికి, హా అప్పడాలు అమ్ముకో అంటూ సిరి సన్నీకి కౌంటర్ ఇస్తూ అక్కడ్నుంచీ వెళ్లిపోయింది.
ఇక్కడే ఈ మేటర్లో ఇన్వాల్ అయిన షణ్ముక్ సిరికి సపోర్ట్ గా మాట్లాడాడు. సన్నీ కి షణ్ముక్ కి హీటెట్ ఆర్గ్యూమెంట్ జరిగింది. ప్రమోలో ఇద్దరూ ఒకర్ని ఒకరు మాటలు అనుకున్నారు. రెస్పక్ట్ గా మాట్లాడు అంటే నీకెంట్రా రెస్పక్ట్ ఇచ్చేది అంటూ సన్నీ షణ్ముక్ పై విరుచుపడ్డాడు. ఇద్దరూ మాటా మాటా అనుకుని తన్నుకునేవరకూ వెళ్లారు. దమ్ముంటే తన్ను అంటూ షణ్ముక్ సన్నీపై మాటలు విసిరాడు.
హౌస్ లో 10వారాలు గడుస్తున్నా కూడా ఇంతలా షణ్ముక్ ఎప్పుడూ ఆవేశపడలేదు. ఫస్ట్ టైమ్ సన్నీపై ఆవేశంగా వెళ్లాడు అంటూ మేటర్ ఎంతవరకూ వెళ్లింది అనేది చూడాలి. గతంలో షణ్ముక్ సిరి విషయంలోనే సన్నీకి సారీ చెప్పాడు. బ్యాడన్స్ టాస్క్ జరిగేటపుడు సిరి టీషర్ట్ లో సన్నీ చేయి పెట్టాడని చెప్పిన షణ్ముక్ ఆ తర్వాత వీడియోలో పెట్టలేదని తెలిసి సారీ చెప్పాడు. అప్పట్నూంచీ సన్నీకి షణ్ముక్ కి కోల్డ్ వార్ అనేది మనసులో ఉంది. ఇప్పుడు అది బయటపడింది. ప్రోమో చూస్తుంటే ఇద్దరికీ గట్టిగానే పడింది. మరి ఎపిసోడ్ లో ఎవరిది తప్పు అనేది తెలియాల్సి ఉంది.