‘రెడ్’ లో ఐటెం సాంగ్ తో రెచ్చ గొట్టబోతున్న హెబ్బా..!

  • March 3, 2020 / 06:16 PM IST

‘అల ఎలా’ ‘కుమారి 21ఎఫ్’ ‘ఈడో రకం ఆడో రకం’ ‘నేను నాన్న బాయ్ ఫ్రెండ్స్’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడ’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన హెబ్బా పటేల్… ఆ తరువాత హిట్లు అందుకోలేకపోయింది. దీంతో ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. అప్పటివరకూ సంపాదించుకున్న క్రేజ్ అంతా పోయిందనే చెప్పాలి. ఆ తరువాత ‘ఏంజెల్’ ’24 కిస్సెస్’ వంటి చిత్రాల్లో చేసి మరింతగా తన క్రేజ్ ను పాడుచేసుకుంది హెబ్బా. ప్రస్తుతం క్రిష్ నిర్మణంలో ‘మస్తీస్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఈ బ్యూటీ కొన్ని వ్యాంప్ రోల్స్ మరియు ఐటెం సాంగ్స్ కు మాత్రమే పరిమితమయ్యేలా ఉంది.

ఇటీవల వచ్చిన ‘భీష్మ’ చిత్రంలో ఎవ్వరూ ఊహించని విధంగా మతిపోయే క్లీవేజ్ షో తో షాకిచ్చింది. ఆ సినిమా కథ ఈమె పాత్ర వల్లే మలుపు తిరుగుతుంది. అందుకే ఈమె అలాంటి పాత్రలకే సరిపోతుందేమో అని డైరెక్టర్లు సైతం ఫిక్సయిపోయారో ఏమో కానీ.. ఇప్పుడు రామ్ నటిస్తోన్న ‘రెడ్’ చిత్రంలో కూడా ఓ ఐటెం సాంగ్ లో చిందేయబోతుందట ఈ అమ్మడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట తెరకెక్కబోతుంది సమాచారం. యమ హాట్ గా హెబ్బా ఈ పాటలో చిందులేయ్యబోతుందని సమాచారం.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus