సినిమా అవకాశాలు తగ్గడంతో.. డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి జంప్

  • December 19, 2019 / 12:42 PM IST

“కుమారి 21ఎఫ్”తో రచ్చ చేసి హెబ్బా పటేల్ కు ఆ తర్వాత సరైన విజయం లభించలేదు. అందాల ఆరబోతకు ఎన్నడూ అడ్డు చెప్పని హెబ్బాకు హిట్ మాత్రం దొరకలేదు. వరుస పరాజయాల అనంతరం సెకండ్ హీరోయిన్ గా మాత్రమే కాక నెగిటివ్ రోల్స్ కూడా ప్లే చేయడం మొదలెట్టింది. ప్రస్తుతం నితిన్ “భీష్మ” చిత్రంలో నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్న హెబ్బా.. త్వరలోనే వెబ్ సిరీస్ లో నటించేందుకు సన్నద్ధమవుతోంది.

తెలుగులో సరైన ఆఫర్లు రాకపోతుండడమే ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకోవడం వెనుక కారణం. అయితే.. సమంత, హన్సిక వంటి వారు కూడా ఇప్పుడు వెబ్ సిరీసుల్లో నటిస్తున్నారు కాబట్టి ఇది పెద్ద మైనస్ ఏమీ కాదు. మరి ఈ సిరీస్ ఆమె కెరీర్ కు ఏమేరకు ప్లస్ అవుతుందో చూడాలి.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus