వావ్ .. హేబా హాట్ లుక్

  • May 18, 2016 / 01:21 PM IST

అచ్చమైన తెలుగు అమ్మాయిల “అలా ఎలా” సినిమాలో కనిపించి.. రెండవ సినిమాలోనే బోల్డ్ మాటలతో అదర గొట్టిన సెక్సీ భామ హేబా పటేల్. కుమారి 21f చిత్రంలో తన నటనతో కుర్రోళ్ళకు నిద్ర లేకుండా చేసింది. ఈ సినిమా ద్వారా బాగా పాపులర్ అయింది. దీంతో సినిమా ఆఫర్లతో పాటు, ప్రముఖ మ్యాగజైన్ ముఖ పేజీఫై ఫోజులిచ్చే అవకాశాన్నికొట్టేసింది.

బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్లో రెడ్ మ్యాగజైన్ కవర్ పేజీ ఫై సెక్సీగా స్టిల్ ఇచ్చింది. యూ అండ్ ఐ మ్యాగజైన్ కవర్ పేజీ ఫై మాత్రం కూల్ గా డిజనైర్ పార్టీ వేర్లో దర్శనమిచ్చింది. ఈ రెండు మే ఎడిషన్ గా మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ఇవి తప్పకుండా కుర్రకారుని ఆకట్టుకుంటాయి అనడంలో సందేహం లేదు.

ఈడో రకం వాడో రకం సినిమా విజయాన్ని ఆస్వాదించే సమయంలో కవర్ పేజీ అవకాశం రావడంతో హేబా పటేల్ చాలా ఆనందిస్తోంది. ఈ హాట్ సుందరి ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ పక్కన మిస్టర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus