Salaar: హీరోయిజం అంటే డైలాగేనా? డైలాగ్ లేకపోతేనేం ఆ ఒక్క ఫ్రేమ్ చాలదా!
July 6, 2023 / 04:25 PM IST
|Follow Us
ఒకేసారి బాధ, సంతోషం కలిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు దీనికి సరైన సమాధానం చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్‌ని అడగాల్సిందే. ‘ఆదిపురుష్’ లాంటి డిజాస్టర్ తర్వాత సరైన సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తుంటే ‘సలార్’ టీజర్ వచ్చి అదరగొట్టింది. ఆ ఎలివేషన్లు, బ్యాగ్రౌండ్, డైలాగ్ (?) అదిరిపోయాయి. అయితే ఇక్కడే ఓ బాధ కూడా ఉంది. ఆ డైలాగ్ ఏదో ప్రభాస్‌కి ఇచ్చి ఉంటే, ప్రభాస్‌ను ఫుల్ ప్లెడ్జ్‌లో చూపించి ఉంటే బాగుండు అనేది ఫ్యాన్స్ బాధ. అలా ఒకేసారి ఆనందం, ఆవేదన కనిపిస్తున్నాయి.
ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్లు, థ్రెడ్స్, పోస్ట్‌లు చేస్తున్నారు. అంతలా మారిపోయింది సోషల్ మీడియా. టీజర్ సూపర్ అని ఆనందపడుతూనే, ప్రభాస్‌కి డైలాగ్ లేదు, సరిగ్గా చూపించలేదు అంటున్నారు. అయితే హీరోను ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ దిట్ట. దానికి ఆయన టినూ ఆనంద్ క్యారెక్టర్‌ను వాడుకున్నారు. ఆయన డైలాగ్ చెప్పినా అది హీరో గురించే. అయితే ప్రభాస్ డైలాగ్ కూడా ఒకటి ఉంటే బాగుండు అనేది ఫ్యాన్స్ మాట. దీనిని కూడా ప్రశాంత్ నీల్ పరిగణలోకి తీసుకొని ఉంటే బాగుండేది.
అయితే ఇక్కడే ఓ విషయం గమనించాలి. అదే హీరోను ఎలా చూపించారు, హీరోను ఎలా ఎలివేట్ చేయాలి అనేది. ప్రశాంత్ నీల్ ఈ విషయంలో తోపు అని మరోసారి నిరూపించారు. ‘సాహో’ సినిమాలో ఫైట్ సీన్ ప్రభాస్ బాడీని షేక్ చేసి.. యుద్ధానికి రెడీ అవుతాడు. ప్రచార చిత్రాల్లో ఆ సీన్ చూసి ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బి అయ్యారు. సినిమాలో అయితే ఇంకా అదిరిపోయింది. ఇప్పుడు (Salaar) ‘సలార్’లో కూడా ఇలాంటి సీన్ ఒకటి ఉంది. ప్రభాస్ భుజాన ఉన్న కత్తిని అదే స్టైల్లో చేతిలోకి తీసుకుంటాడు.
ఆ సీన్‌ను రిపీట్ మోడ్‌లో చూడని ప్రభాస్ ఫ్యాన్ ఉండడు. కత్తి భుజం మీదకు రావడం, ప్రభాస్ అలా తీసుకోవడం అనేది ఎలివేషన్‌గా వాడొచ్చు అని ప్రశాంత్ నీల్ అనుకోవడం దానికి అంతే మ్యాన్లీగా చూపించడం సూపర్. కటౌట్ బట్టే కొన్ని సీన్స్ ఉంటాయి ఆయన సినిమాల్లో. దానికి ఇదొక సాక్ష్యం. ప్రభాస్ లాంటి కటౌట్‌కి ఇలాంటి సీన్ పడ్డాక డైలాగ్‌ల గురించి, లుక్ గురించి ఆలోచించడం ఎందుకు? ఆ సీన్ చూసి హైప్‌ను డబుల్, ట్రిపుల్, క్వాడ్రపుల్ చేసుకుంటే సరి.