Vijay Devarakonda: కల్కి సినిమాకు విజయ్ దేవరకొండ ఎంత తీసుకున్నారో తెలుసా?
July 1, 2024 / 11:36 AM IST
|Follow Us
ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మూవీ కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది. మూడు రోజుల్లో ఈ సినిమాకు 415 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాగా ఈరోజు కలెక్షన్లతో ఈ సినిమా 500 కోట్ల రూపాయల మార్క్ ను దాటే ఛాన్స్ అయితే ఉంటుంది. మరోవైపు ఈ సినిమాలో అర్జునుని పాత్రలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొన్ని నిమిషాలే కనిపించినా తన నటనతో మెప్పించారు. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ ఎలాంటి పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్, నాగ్ అశ్విన్ పై గౌరవంతో మాత్రమే విజయ్ దేవరకొండ, మరి కొందరు నటులు ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లో నటించారని చాలామంది గెస్ట్ లు రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. కల్కి2 లో పాత్ర నిడివి ఎక్కువగా ఉంటే మాత్రం విజయ్ దేవరకొండ పారితోషికం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. విజయ్ దేవరకొండ తర్వాత సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేయడంతో పాటు భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ వివాదాలకు ఛాన్స్ ఇవ్వకుండా కెరీర్ పరంగా ముందడుగులు వేస్తున్నారు. కొంతమంది కావాలని విజయ్ ను టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
విజయ్ దేవరకొండ ఇతర భాషల ప్రేక్షకులకు సైతం నచ్చే కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. త్వరలో విజయ్ దేవరకొండ కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. విజయ్ దేవరకొండను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.