Abbas: హీరో అబ్బాస్ లేటెస్ట్ పిక్ వైరల్..ఇప్పుడతను ఏం చేస్తున్నాడో తెలుసా?

  • June 2, 2021 / 06:20 PM IST

‘ప్రేమదేశం’ చిత్రంతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా క్రేజీ హీరోగా మారిపోయాడు అబ్బాస్.1996 లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో అబ్బాస్ కు వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి. 1996 నుండీ 2002 వరకు ఇతను లీడ్ యాక్టర్ గా కొనసాగాడు. అబ్బాస్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..! అప్పట్లో చాలా మంది అమ్మాయిలకు క్రష్ అంటే అబ్బాస్ పేరే చెప్పేవారు.అంతేకాదు చాలా మంది అబ్బాయిలు..

అబ్బాస్ హెయిర్ స్టైల్ ట్రై చేసేవారు. అంతలా అబ్బాస్ కు యూత్ లో ఫాలోయింగ్ ఉండేది.ఇక బాలకృష్ణ ‘కృష్ణబాబు’, వెంకటేష్ ‘రాజా’, రజినీకాంత్ ‘నరసింహ’ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో కూడా అబ్బాస్ సెకండ్ హీరోగా నటించాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత ఇతను సినిమాల్లో నటించడం మానేసాడు. ‘నటించడం అనేది బోర్ కొట్టేసిందని, మనసు పెట్టలేకపోతున్నానని’ మొన్నామధ్య ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు అబ్బాస్.అయితే ఇప్పుడు అబ్బాస్ ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

ప్రస్తుతం అతను న్యూజీల్యాండ్ లో ఉంటున్నాడు.ఫ్యామిలీతో సహా అతను అక్కడే స్థిరపడ్డాడు. అక్కడ మోటివేషనల్ స్పీకర్ గా అబ్బాస్ పనిచేస్తున్నాడట. ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటూ హాయిగా ఫ్యామిలీతో గడుపుతున్నాడు. తాజాగా అబ్బాస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో అతను గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. అయితే అతని అభిమానులు మాత్రం చాలా కాలం తర్వాత అబ్బాస్ ను చూసే అవకాశం దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus