షూటింగ్‌లో అదరగొట్టిన అజిత్‌ అండ్‌ టీమ్‌!

  • August 1, 2022 / 01:15 PM IST

అజిత్‌ అంటే కేవలం యాక్టర్‌ మాత్రమే కాదు.. ఆయనలో ఇంకా చాలా టాలెంట్స్‌ ఉన్నాయి అనే విషయం తెలిసిందే. సినిమాల్లో నటిస్తూనే అప్పుడప్పుడు వాటిలో కూడా తన ప్రతిభను చూపిస్తూ ఉంటాడు. అలా అజిత్‌కి ఉన్న టాలెంట్స్‌లో ఫొటోగ్రఫీ, షూటింగ్‌, బైక్‌ రేసింగ్‌ లాంటివి ఉన్నాయి. తాజాగా వీటిలో ఓ విభాగమైన రైఫిల్‌ షూటింగ్‌లో అజిత్‌ టీమ్‌ ఘన విజయం సాధించింది. తమిళనాడులో జరిగిన రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో మొత్తంగా ఆరు మెడల్స్‌ సాధించింది.

ప్రస్తుతం ఈ వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అజిత్‌ తాజాగా తన టీమ్‌తో కలసి రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో అదరగొట్టారు. ఈ క్రమంలో నాలుగు బంగారు పతాకాలతో పాటు, రెండు కాంస్య పతకాలను సాధించారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో జరిగిన ఈ పోటీల్లో మొత్తంగా ఆరు పతకాలను అందుకున్నారు అజిత్‌ టీమ్‌. సెంటర్‌ ఫైర్‌ పిస్టల్‌ మాస్టర్స్‌ మెన్‌ టీమ్‌, స్టాండర్డ్‌ పిస్టల్‌ మాస్టర్‌ టీమ్‌, 50 మీ. ఫ్రీ పిస్టల్‌ మాస్టర్‌ మెన్‌, స్టాండర్డ్‌ పిస్టల్‌ మాస్టర్‌ మెన్‌ కేటగిరిల్లో బంగారు పతకాలు వచ్చాయి.

ఇక 50 మీటర్ల ఫ్రీ పిస్టల్‌ మెన్స్‌, స్టాండర్డ్‌ పిస్టల్‌ మెన్స్‌ టీమ్‌ ఈ పోటీల్లో కాంస్య పతకాలను అందుకుంది. ఈ పోటీలకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గన్‌తో అజిత్‌ ఆ ఫొటోల్లో వావ్‌ అనిపిస్తున్నారు. దాంతో పాటు పతకాల లిస్ట్‌ కూడా పోస్టుల్లో కనిపిస్తోంది. ఇక అజిత్‌ బైక్‌ రేసింగ్‌, ఫొటోగ్రఫీ గురించి మనం గతంలో చూశాం. ప్రస్తుతం హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో అజిత్‌ నటిస్తున్నారు #AK61 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇందులో అజిత్‌ గుబురు గడ్డంతో కనిపించబోతున్నాడు. గతేడాది ఈ కాంబినేషన్‌లోనే వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వాలిమై’ బాక్సాఫీస్‌ దగ్గర మెప్పించింది. ఇప్పుడు 61వ సినిమాతో మరోసారి ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈలోపు షూటింగ్‌లో పతకాలతో దుమ్మురేపారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus