న్యూడ్ గా నటించడానికి చాలా ఇబ్బంది పడ్డా!

  • January 22, 2021 / 02:55 PM IST

టాలీవుడ్ లో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్ మొదటి నుండి తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగానే కథలను ఎన్నుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. అలానే ఆయన నటిస్తోన్న ‘నాంది’ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్ లలో అల్లరి నరేష్ న్యూడ్ గా కనిపించారు.

ఇలాంటి పాత్రల్లో నటించడానికి హీరోలు అంత తొందరగా సాహసించరు. కానీ అల్లరి నరేష్ నటించడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సినిమాలో న్యూడ్ సన్నివేశాలలో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని నరేష్ చెప్పారు. అందరినీ దూరంగా వెళ్లిపొమ్మని.. గోడవైపు తిరిగి నటించానని.. ఎవరికీ కనిపించకుండా చేశానని చెప్పుకొచ్చారు. ఆ సన్నివేశాల్లో నేచురల్ గా చేస్తేనే బాగుంటుందని.. స్కిన్స్ లాంటివి వేసినా అసహ్యంగా కనిపిస్తుందని డైరెక్టర్ చెప్పడంతో అలానే నటించానని వెల్లడించారు.

దర్శకుడు కథ చెప్పినప్పటి నుండి న్యూడ్ సీన్ చేయాలని చెప్తూనే ఉన్నారని.. అదొక్కటే టెన్షన్ పడ్డానని అన్నారు. కానీ అలాంటి పాత్రలు చేసినప్పుడే నటుడిగా పేరొస్తుందని.. రీచ్ కూడా అలానే ఉంటుందని చెప్పారు. బయటకి వెళ్లినప్పుడు చాలా మంది ‘నాంది’ రిలీజ్ ఎప్పుడని అడుగుతున్నారని.. జనాలు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus