వెంకీ కుడుముల కొత్త సినిమా ఫిక్స్‌.. కథ మారిందా? అదేనా?

  • March 17, 2023 / 07:23 PM IST

మెగా స్టార్‌తో సినిమా చేద్దాం అనుకుని.. అంతా రెడీ చేసుకుని ఆఖరి అడుగులో వెనక్కి వెళ్లిపోయిన ఓ దర్శకుడు ఇప్పుడు పవర్‌ స్టార్‌ ఫ్యాన్‌తో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది ఆ దర్శకుడు ఎవరు అనేది, ఆయనెవరో తెలిసిపోతే ఆ అభిమాని కమ్‌ హీరో ఎవరు అనేది కూడా తెలిసిపోతుంది. అంతేకాదు ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి అదనపు సమాచారం కూడా బయటకు వచ్చింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, త్వరలో సినిమా అనౌన్స్‌మెంట్‌, ప్రారంభం కూడా ఉంటాయి అంటున్నారు.

ఇప్పుడు పేర్లతో సహా చూసుకుంటే.. ఆ హీరో నితిన్‌, దర్శకుడు వెంకీ కుడుముల. కొన్నాళ్ల క్రితం చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల సినిమా అనౌన్స్‌ చేశారు. ఫ్యాన్‌తో మెగాస్టార్‌ సినిమా అంటూ ఘనంగా చెప్పుకొచ్చారు కూడా. అయితే ఆయన కథతో చిరంజీవిని మెప్పించలేకపోయారని వార్తలొచ్చాయి. అనుకున్నట్లే వెంకీ కుడుముల వేరే హీరోలను కలవడం ప్రారంభించారు. దీంతో చిరంజీవి సినిమా ఇక లేనట్లే అని ఫిక్స్‌ అయ్యారు. ఇప్పుడు ఇది ఫైనల్‌ అయిపోయింది అని చెప్పొచ్చు.

మైత్రీ మూవీ మేకర్స్‌ – నితిన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకు వెంకీ కుడుములనే దర్శకుడు అట. ఉగాది నాడు ఈ సినిమా గురించి అధికారికంగా అనౌన్స్‌ చేస్తారని సమాచారం. దీంతో చిరు – వెంకీ కుడుమల సినిమా పూర్తిగా ఆగిపోయినట్లే అని ఆ రోజు క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు. నితిన్‌ – వెంకీ కుడుమల గతంలో ‘భీష్మ’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం అందుకుంది.

ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌ అని చెబుతున్నారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ప్లాష్ బ్యాక్ 80ల నాటి కాలంలో జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో నితిన్ క్యారెక్టర్‌లో మూడు వేరియేషన్లు ఉంటాయని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు. అయితే చిరంజీవికి చెప్పిన కథతోనే ఈ సినిమానా? లేక అది వేరే కథనా అనేది తెలియాల్సి ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus