Gopichand: అవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నచ్చదు.. హీరో వ్యాఖ్యలు!
June 14, 2022 / 04:52 PM IST
|Follow Us
సెలబ్రిటీల సినిమాల కంటే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చాలా వైరల్ అవుతుంటాయి. మన స్టార్స్ కూడా ఎప్పటికప్పుడు తమ ప్రైవేట్ లైఫ్ కి సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటారు. కానీ అలా చేయడం తనకు నచ్చదని చెబుతున్నారు హీరో గోపీచంద్. వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేయడం తనకు అసలు నచ్చదని స్పష్టం చేశారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయనని అన్నారు.
వ్యక్తజీవితమపై నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా తనదేనని తెలిపారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ ను కేవలం సినిమా అప్డేట్స్ కోసం మాత్రమే వాడతానని అన్నారు. వ్యక్తిగత విషయాలను అసలు పోస్ట్ చేయనని చెప్పారు. తన ప్రైవేట్ లైఫ్ ను పబ్లిక్ లో పెట్టడం ఇష్టం ఉండదని.. అలా చేస్తే ప్రైవసీ పోతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది తమ వ్యక్తిగత విషయాలను కూడా చెబుతుంటారని..
అది వాళ్ల ఇష్టమని.. కానీ తన దృష్టిలో వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పెట్టడం నచ్చదని.. అలా చేస్తే తన ప్రైవసీతో పాటు తన కుటుంబ సభ్యుల ప్రైవసీ కూడా పోతుందని అన్నారు. సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్ అని.. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిందని అన్నారు. మరీ ఎక్కువగా వాడితే ఏదొక సమయంలో తిరిగి మనకే రివర్స్ కొడుతుందని అన్నారు.
ఇంటర్వ్యూలలో గోపీచంద్ చాలా తక్కువ మాట్లాడుతుంటారు. ఈ విషయంపై స్పందిస్తూ.. ఈ మధ్య తన ఫ్రెండ్ ప్రభాస్ ఇంటర్వ్యూలలో ఎక్కువగా మాట్లాడుతున్నాడని.. తను కూడా ప్రభాస్ మాదిరి కొంచెం మారానని.. కాస్త ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.