Karthi: సేవా కార్యక్రమాల కోసం 1.25 కోట్లు దానం చేసిన కార్తీ!
October 31, 2023 / 09:51 PM IST
|Follow Us
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో హీరో కార్తీ ఒకరు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కార్తీ ఎన్నో విభిన్నమైన కథ సినిమాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈయన చివరిగా పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఈ సినిమా తర్వాత ఈయన జపాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కార్తీ 25వ సినిమా కావటం విశేషం. ఈ క్రమంలోనే తన 25వ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు ఈ క్రమంలోనే దాదాపు 25 రోజులపాటు 2500 మంది అనాధలకు తమిళనాడులోని వివిధ ప్రాంతాలలో ఉచిత భోజనాలను ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే తాజాగా మరోసారి హీరో కార్తీ (Karthi) తన మంచి మనసును చాటుకున్నారు. ఈయన హాస్పిటల్స్, స్కూల్స్ అనాధాశ్రమాలు పేదవారికి ఉచితంగా ఆహారం వంటి సామాజిక సేవ కార్యక్రమాల కోసం ఏకంగా 1.25 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. జపాన్ సినిమా తన కెరీయర్లోని 25వ సినిమా కావటంతో ఈ సినిమా ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా ఈయన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తన 25వ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో 25 హాస్పిటల్స్,25 ప్రభుత్వ స్కూల్స్ ,25అనాధాశ్రమాలు, 25 రోజులపాటు పేదలకు అన్నదానం వంటి కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఈయన 1.25 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే తన అన్నయ్య సూర్య ఆగరం ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి మంచి జీవితాన్ని అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా అన్నయ్య బాటలోనే తమ్ముడు కూడా పయనిస్తూ మంచి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో ఈయన మంచి మనసుపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.