Hero Collections: సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘హీరో’..!
January 24, 2022 / 01:56 PM IST
|Follow Us
కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు అయిన అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.’అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై శ్రీమతి గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి ఐ.ఎం.డి.బి లో అయితే మంచి రేటింగ్ వచ్చింది కానీ క్రిటిక్స్ నుండీ మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్వచ్చింది.
అయినప్పటికీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనే విధంగా నమోదయ్యాయి. కానీ వీకెండ్ తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దివాలా తీసింది. ‘హీరో’ 9 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
0.73 cr
సీడెడ్
0.36 cr
ఉత్తరాంధ్ర
0.41 cr
ఈస్ట్
0.17 cr
వెస్ట్
0.12 cr
గుంటూరు
0.23 cr
కృష్ణా
0.13 cr
నెల్లూరు
0.09 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.08 Cr
ఓవర్సీస్
0.10 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
2.42 cr
‘హీరో’ చిత్రానికి రూ.5.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 9 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.42 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో 3.58 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రెండు రోజులు పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం వీక్ డేస్ లో మాత్రం స్లీపేసింది.సెకండ్ వీకెండ్ ను కూడా ఈ చిత్రం క్యాష్ చేసుకోలేకపోయింది.సోలో రిలీజ్ అయ్యి ఉంటే.. ఈ మూవీకి వర్కౌట్ అయ్యి ఉండేదేమో. ఇప్పుడు పోటీలో రిలీజ్ అవ్వడం పైగా ఇంకో పక్క కరోనా ఎఫెక్ట్ కూడా ఉండడంతో కలెక్షన్లు రావడం లేదని స్పష్టమవుతుంది.