‘ఎం.సి.ఏ’ చిత్రం తరువాత నాని నటించిన సినిమాలు భారీ లాభాలను తెచ్చిపెట్టినవి లేవు. ఆ తరువాత వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ ‘దేవదాస్’ చిత్రాలు ప్లాప్ అయ్యాయి. ‘జెర్సీ’ చిత్రానికి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ రెండు, మూడు ఏరియాల్లో నష్టాలు వచ్చాయని ట్రేడ్ పండితుల తేల్చేసారు. ఆ టైములో ‘కాంచన3’ ఎఫెక్ట్ కూడా ఓ కారణమని వారు చెప్పుకొచ్చారు. ఇక తరువాత వచ్చిన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ మంచి ఓపెనింగ్స్ ను రాబట్టినప్పటికీ..
బ్రేక్ ఈవెన్ కాలేదు. ‘వి’ సినిమా విషయంలో దర్శకనిర్మాతలు ఎలాగూ సేఫ్ గేమ్ ఆడేసారు కాబట్టి..దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉండగా.. వరుసగా నాని సినిమాలు ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చెయ్యకపోయినా..మరోపక్క కరోనా ఎఫెక్ట్ ఉన్నా..అతని పారితోషికం పై ఏమాత్రం ఎఫెక్ట్ పడలేదని తెలుస్తుంది. మొన్నటి వరకూ ఒక్కో చిత్రానికి రూ.7కోట్ల పారితోషికం అందుకుంటూ వచ్చిన నాని.. ఇప్పుడు ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం కోసం రూ.9కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడట.
నాని సినిమాలకు నాన్ థియేట్రికల్ రైట్స్ బాగా అమ్ముడవుతాయి. వాటితోనే నిర్మాతకు 60శాతం రికవరీ జరిగిపోతుంది. అందుకే అతను డిమాండ్ చేసిన రూ.9కోట్లు పెద్ద ఎక్కువ కాదని దర్శకనిర్మాతలు ధైర్యం చేసి ముందుకొస్తున్నట్టు స్పష్టమవుతుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?