కరోనా కాలంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రాణాలు నిలిపి దేవాలయాలుగా మారుగుతుంటే… కొన్ని ఆసుపత్రులు దొరికిందే తడవుగా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. తాజాగా యువ కథానాయకుడు నిఖిల్ కూడా ఇదే విధంగా స్పందించారు. వైద్యం పేరుతో కొన్ని ఆస్పత్రులు సామాన్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సర్జరీ ఏదైనా సరే.. లక్షల్లోనే బిల్లులు కట్టించుకుంటున్నారంటున్నాడు నిఖిల్. నిఖిల్ ఇటీవల కొంతమందికి చెందిన ఆస్పత్రి బిల్లులను పరిశీలించారట.
వాటిలో చాలా బిల్లులు… ₹10 లక్షలకు మించి ఉన్నాయట. సాధారణ సర్జరీకి కూడా మన ఆస్పత్రులు ఎందుకు ఇంత ఎక్కువ ఫీజును తీసుకుంటున్నాయి… అసలు వీటిని కంట్రోల్ చేసేదెవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిఖిల్. ఆసుపత్రుల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొన్ని ఆసుపత్రుల దందా కొనసాగుతూనే ఉంది. నిఖిల్ ఆగ్రహాన్ని ఎవరైనా పట్టించుకొని పరిస్థితులు కుదిరిస్తే బాగుండు. కరోనా పరిస్థితుల కారణంగా చిత్రీకరణలు నిలిచిపోవడంతో తన టీమ్‌తో కలిసి నిఖిల్కరోనా బాధితులకు సాయం అందిస్తున్నారు.
ఆస్పత్రి పడకలు, మందులు, ఏ ఇతర సామగ్రి కావాలని ఎవరైనా సోషల్ మీడియా ద్వారా కోరితే… వెంటనే స్పందించి వారికి అవి అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో పరిచయాలే కొత్త కరెన్సీ అంటున్నాడు నిఖిల్. సాయం కోసం నన్ను ట్యాగ్ చేస్తూ వేలకొద్దీ పోస్టులు వచ్చినా… అందులో రోజుకి 50 మంది సహాయం చేయగలుగుతున్నాను. కొన్ని అభ్యర్థల్ని నా అభిమానులు స్వీకరించడం హృదయాన్ని హత్తుకుంది. ఒకరిని రక్షించేందుకు మరొకరు ముందుకు రావడం సంతోషకర విషయమన్నాడు నిఖిల్.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!