Nithiin: థియేటర్ లో నవ్వకపోతే టికెట్ డబ్బులు తిరిగి ఇస్తా..!

  • December 4, 2023 / 07:18 PM IST

యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో నితిన్ కచ్చితంగా ఉంటాడు. కెరీర్ ప్రారంభం లోనే కల్ట్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకున్న నితిన్,ఆ తర్వాత వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కెరీర్ ని దాదాపుగా క్లోజ్ చేసుకునే స్థితికి వచేసాడు. ఆ తర్వాత ఆయన ‘ఇష్క్’ చిత్రం తో సూపర్ హిట్ కొట్టి భారీ కం బ్యాక్ ఇవ్వగా, అప్పటి నుండి అదే ఫ్లో ని కొనసాగిస్తూ, ఎన్నో సూపర్ హిట్స్ కొట్టి తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు.

అయితే ఈమధ్య కాలం లో ఆయనకీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన నితిన్ గత చిత్రం ‘మాచెర్ల నియోజకవర్గం’ ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అందుకే తనకి బాగా కలిసి వచ్చిన ఎంటర్టైన్మెంట్ జానర్ ని ఎంచుకొని ‘ ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ అనే చిత్రాన్ని చేసాడు. ఈ సినిమా 8 వ తారీఖున థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా నితిన్ వరుసగా ప్రోమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గా విడుదలైన మ్యాడ్ చిత్రం ప్రేక్షకులకు నవ్వు రప్పించకపోతే టికెట్ డబ్బులు వాపస్ చేస్తానని నిర్మాత నాగవంశీ చెప్పాడు. నేను కూడా అదే ఛాలెంజ్ చేస్తున్నాను, మా ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ కూడా ప్రేక్షకులకు నవ్వు రప్పించకపోతే టికెట్ డబ్బులు నేను కాదు, నాగవంశీ నే వాపస్ చేస్తాడు.

నాకు ఆయనకీ చాలా పాత లావాదేవీలు ఉన్నాయి’ అంటూ (Nithiin) నితిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల నటించగా, సీనియర్ హీరో రాజశేఖర్ ముఖ్య పాత్ర పోషించాడు. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus