ఫారిన్ కి మకాం మార్చానున్న నితిన్ !!

  • December 26, 2016 / 01:13 PM IST

మన టాలీవుడ్ టాప్ హీరోలందరూ హీరోయిన్లతో సాంగేసుకోవడానికి ఫారిన్ చెక్కేయడం ఎన్టీఆర్ కాలం నుంచి జరుగుతున్న తంతే. కేవలం పాటల కోసం అక్కడికి వెళ్ళడమేంటని ఆలోచించి ఈమధ్య సినిమాలోని కీలక సన్నివేశాలను ఫారిన్ కంట్రీస్ లో షూట్ చేయడం మొదలుపెట్టారు. ఇక సుకుమార్ అయితే ఓ పదడుగులు ముందుకేసి “నాన్నకు ప్రేమతో” సినిమా మొత్తాన్ని లండన్ లోనే చుట్టేశాడు. ఇప్పుడు క్యూట్ స్టార్ నితిన్ ఏకంగా తన మకాం మార్చేసి ఫారిన్ లో సెటిల్ అయిపోవాలనుకొంటున్నాడు.

అయితే.. పర్మనెంట్ గా కాదులెండి. నితిన్ ఒప్పుకొన్న “రౌడీ ఫెలో” ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో నటించబోయే సినిమా, హను రాఘవపూడి దర్శకత్వంలో నటించే మరో సినిమా షూటింగ్ ఫారిన్ లోనే జరగనుందట. సో, వరుసబెట్టి రెండు సినిమాల షూటింగ్స్ ఫారిన్ లోనే జరగనుండడంతో.. వచ్చే ఆరునెలల పాటు అక్కడే గడిపేందుకు సన్నద్ధమవుతున్నాడు నితిన్. మధ్యలో ఒకట్రెండు సార్లు మాత్రం ఇండియా వచ్చి మళ్ళీ ఫారిన్ కి వెళ్లిపోతాడట!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus