Nithiin: ఆ ఏరియాలో నితిన్ మల్టీప్లెక్స్.. ఆ హీరోలలా సక్సెస్ అవుతారా?

  • June 17, 2024 / 01:18 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన నితిన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. నితిన్ ప్రస్తుతం నటిస్తున్న తమ్ముడు, రాబిన్ హుడ్ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు రిలీజ్ కానుండగా ఈ సినిమాలు నితిన్ (Nithiin) కోరుకున్న భారీ సక్సెస్ ను అందించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దిల్ రాజు (Dil Raju) బ్యానర్ లో తమ్ముడు (Thammudu) , మైత్రీ బ్యానర్ లో రాబిన్ హుడ్ (Robinhood) తెరకెక్కుతున్నాయి.

అయితే మహేష్ (Mahesh Babu) , బన్నీ (Allu Arjun) బాటలో నితిన్ పయనిస్తున్నారని తెలుస్తోంది. ఏషియన్ గ్రూప్స్ తో కలిసి నితిన్ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం అందుతోంది. హీరో నితిన్ కు ఇంతకుముందే సితార పేరుతో సొంతంగా థియేటర్ ఉండగా రేనోవేషన్ చేసి మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారని ఇందుకు సంబంధించిన పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయని భోగట్టా.

సంగారెడ్డి ఏరియాలో ఈ మల్టీప్లెక్స్ అందుబాటులోకి రానుండటం ఇక్కడి సినీ అభిమానులకు తీపికబురు అనే చెప్పాలి. ఏషియన్ నితిన్ సితార పేరుతో ఈ మల్టీప్లెక్స్ అందుబాటులోకి రానుందని సమాచారం అందుతోంది. నితిన్ మహేష్, బన్నీ స్థాయిలో మల్టీప్లెక్స్ బిజినెస్ లో సక్సెస్ సాధించి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారేమో చూడాల్సి ఉంది. నితిన్ వైపు నుంచి ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇప్పటివరకు మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రతి హీరో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు. నితిన్ రెమ్యునరేషన్ మరీ భారీ రేంజ్ లో అయితే లేదని తెలుస్తోంది. భీష్మ (Bheeshma)  తర్వాత నితిన్ కు ఆ రేంజ్ హిట్ దక్కలేదు. నితిన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా మాస్ సినిమాలు ఈ హీరోకు ఎక్కువగా షాకులిచ్చాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus