Prashanth: ఆ ఫ్లాప్ సినిమా సీక్రెట్స్ చెప్పిన ప్రశాంత్.. అందుకే చేశానంటూ?
August 8, 2024 / 12:39 PM IST
|Follow Us
జీన్స్, జోడీ సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటులలో ప్రశాంత్ (Prashanth Thiagarajan) ఒకరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రశాంత్ కు ప్రత్యేక గుర్తింపు ఉండగా తాజాగా ఈ నటుడు ఒక సందర్భంలో చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ తమిళ మూవీ అంధగన్ లో నటించగా ఈ మూవీ త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది. వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) సినిమాలో నటించిన ప్రశాంత్ ఆ సినిమాలో నటించడం వెనుక అసలు కారణాల గురించి చెప్పుకొచ్చారు.
Prashanth
మాకు సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ఉందని నేను మా ప్రొడక్షన్ హౌస్ లోనే ఎక్కువ సినిమాలు చేశానని ఆయన తెలిపారు. ఇతర నిర్మాణ సంస్థలలో సైతం నేను పని చేసినా ఎక్కువ సినిమాలు చేయలేదని ప్రశాంత్ వెల్లడించారు. ఇతరులను ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదని ప్రశాంత్ పేర్కొన్నారు. బయట నిర్మాతలతో పని చేసే సమయంలో మనం అన్ని విధాలుగా బాధ్యతాయుతంగా ఉండాలని నేను ఫీలవుతానని ప్రశాంత్ చెప్పుకొచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో నిర్మాత కీలక పాత్ర పోషిస్తారని నిర్మాతల వల్లే సినిమాలు నిర్మించగలుగుతున్నామని ప్రశాంత్ పేర్కొన్నారు. ఆ క్రమంలోనే నేను సొంత బ్యానర్ లో ఎక్కువ సినిమాలు చేశానని ప్రశాంత్ చెప్పుకొచ్చారు. స్నేహం కారణంగా వినయ విధేయ రామ మూవీలో యాక్ట్ చేశానని ఆయన వెల్లడించారు. చరణ్ (Ram Charan) అంటే ఎంతో అభిమానం ఉందని ప్రశాంత్ వెల్లడించారు.
చరణ్ కు , నాకు మధ్య ఉన్న అనుబంధం, ప్రేమాభిమానం, స్నేహంతో మాత్రమే సినిమాలు చేశానని ప్రశాంత్ పేర్కొన్నారు. బోయపాటి శ్రీను (Boyapati Srinu) తెలుగులో స్టార్ డైరెక్టర్ అని ఆ పాత్రకు నేనే న్యాయం చేయగలనని ఆయన భావించారని ప్రశాంత్ చెప్పుకొచ్చారు. బోయపాటి శ్రీను అంటే నాకు ఎంతో గౌరవం ఉందని ప్రశాంత్ పేర్కొన్నారు. ప్రశాంత్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.