Hero Rajasekhar: హిట్టు కోసం సక్సెస్ ఫుల్ ఫార్ములాని వాడుతున్నాడట..!

  • June 22, 2021 / 04:19 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలైన వెంకటేష్, పవన్ కళ్యాణ్ లని రీమేక్ రాజాలు అంటుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో రీమేక్ లే ఎక్కువ. వాళ్లకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టినవి కూడా రీమేక్ సినిమాలే..! అయితే వీళ్ళతో పాటు యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ను కూడా కొంతవరకు రీమేక్ రాజా అనొచ్చు. ఎందుకంటే ఈయన కూడా చాలా రీమేక్ సినిమాలు చేశారు. అయితే ‘గడ్డం గ్యాంగ్’ తర్వాత కొన్నాళ్ల పాటు రీమేక్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు రాజశేఖర్.

అయితే కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆయన మరో రీమేక్ లో నటిస్తున్నట్టు సమాచారం. రాజశేఖర్ ప్రస్తుతం ‘శేఖర్’ అనే మూవీలో నటిస్తున్నారు.ఇది ఆయనకు 91 వ చిత్రం కావడం విశేషం. అయితే ఇది కూడా ఓ రీమేక్ సినిమా అనేది తాజా సమాచారం. మలయాళంలో సూపర్ హిట్టయిన ఓ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఆధారంగా ‘శేఖర్’ మూవీ రూపొందుతోంది. అను సితార, ముస్కాన్ వంటి భామలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించబోతున్నారు.

జూలై నుండీ ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని సమాచారం. ‘పి.ఎస్.వి గరుడవేగ’ తో హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ కు.. ఆ తర్వాత చేసిన ‘కల్కి’ చిత్రం డిజప్పాయింట్ చేసింది.రిజల్ట్ ను పక్కన పెడితే ఆ చిత్రంలో కూడా రాజశేఖర్ కొత్తగా కనిపించారు. మరి ‘శేఖర్’ తో హిట్టు కొట్టి మళ్ళీ ఆయన ఫామ్ లోకి వస్తారేమో చూడాలి..!

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus