మరోమారు పోలీస్ గా రాజశేఖర్!

  • July 2, 2016 / 09:38 AM IST

“యాంగ్రీ యంగ్ మేన్” అని చెప్పగానే అందరికీ గుర్తొచ్చే నటుడు రాజశేఖర్. పోలీస్ పాత్రల్లో రాజశేఖర్ నటనను మెచ్చుకోనివారు ఉండరు. ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయేవారాయన. అయితే.. ఈమధ్యకాలంలో రాజశేఖర్ కు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. విలన్ రోల్స్ వచ్చినప్పటికీ.. హీరోగానే చేయాలి అని రాజశేఖర్ ఫిక్సయ్యి కూర్చోవడంతో.. వచ్చిన అవకాశాలన్నీ వెనక్కి పోతున్నాయి.

అయితే.. “గుంటూర్ టాకీస్” సినిమాతో కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకొన్న ప్రవీణ్ సత్తారు ఒక పవర్ ఫుల్ పోలీస్ స్టోరీని రెడీ చేసుకొన్నాడట. ఆ క్యారెక్టర్ కు రాజశేఖర్ అయితేనే న్యాయం చేయగలడని భావించి రాజశేఖర్ కు కథ వినిపించాడట, కథ విపరీతంగా నచ్చేయడంతో వెంటనే ప్రవీణ్ కథను ఒకే చేసేశాడట రాజశేఖర్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus