Sharwanand: స్టార్ సింగర్, శర్వానంద్ విడిపోవడానికి కారణం వాళ్లేనా?
May 13, 2023 / 12:53 AM IST
|Follow Us
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు ఎంత కామన్ గా వినిపిస్తూ ఉంటాయో వినిపిస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఓ సినిమా చేస్తున్న టైంలో హీరో హీరోయిన్ ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిన దాఖలాలు ఉన్నాయ్. ఈ క్రమంలోనే రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ కి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. శర్వానంద్ ఐదో తారీకు అనే సినిమాతో హీరోగా పరిచయమైనప్పటికీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత సంక్రాంతి,యువసేన, గౌరీ, లక్ష్మి వంటి సినిమాలలో కొన్ని కీలక పాత్రల్లో నటించారు.
ఇక గమ్యం సినిమాతో శర్వానంద్ మొదటి సారి హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత ప్రస్థానం, రాధా, నువ్వా నేనా, మహానుభావుడు, పడి పడి లేచే మనసు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, శతమానం భవతి, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం వంటి ఎన్నో సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి. ఇక శర్వానంద్ ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే హీరోగా మొత్తం 35 సినిమాల వరకు నటించారు. ఈ విషయం పక్కన పెడితే ఈ మధ్యనే జనవరిలో శర్వనంద్ తాను ప్రేమించిన రక్షిత రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
అయితే ఎంగేజ్మెంట్ చేసుకొని ఇన్ని రోజులు అవుతున్నా కూడా తన పెళ్లి డేట్ ని ప్రకటించడం లేదు. అలాగే కొత్త సినిమాలు కూడా చేయడం లేదు.ఇక ఈ విషయం పక్కన పెడితే గతంలో శర్వానంద్ ఓ పెళ్లైన స్టార్ సింగర్ ని ప్రేమించాడట. అయితే పెళ్లయిందని కూడా ఆలోచించకుండా స్మిత శర్వానంద్ తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడంతో స్మితకి తన భర్తతో తరచూ గొడవలు జరిగేవట. ఇక గొడవలతో విసిగిపోయిన స్మిత తన భర్తకు విడాకులు ఇచ్చి శర్వానంద్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుందట.
ఇక శర్వానంద్ (Sharwanand) కూడా స్మితను చేసుకోవడానికి రెడీ అయ్యారట. కానీ శర్వానంద్ ఫ్యామిలీ వాళ్ళు స్మితకి పెళ్లి జరగడంతో ఆమెను ఇంటి కోడలుగా ఒప్పుకోలేదట. అలాగే స్మిత భర్త శశాంక్ కూడా స్మిత ని వదులుకోలేకపోవడంతో సినీ ఇండస్ట్రీ పెద్దలైన నాగేశ్వరరావు, నాగార్జున , దాసరి నారాయణరావు వంటి పెద్ద మనుషులు స్మితకి తన భర్తకి మధ్య సర్ది చెప్పడంతో స్మిత ఆ తర్వాత తన భర్తతో కలిసి హ్యాపీగా జీవించింది. ఇలా శర్వానంద్ సింగర్ స్మిత ల ప్రేమాయణం గతంలో ఇండస్ట్రీ వైరల్ గా మారింది.