Hero Siddharth: ఏపీ మంత్రులపై హీరో సిద్ధార్థ్ ఫైర్..!
December 24, 2021 / 07:12 PM IST
|Follow Us
ఏపీ మంత్రులపై హీరో సిద్ధార్థ్ పరోక్షంగా ఘాటు కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని నిన్నటి ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం.. సినిమా ఇండస్ట్రీ మధ్య గ్యాప్ పెంచేలా చేశాయి. కొంతమంది నిర్మాతలు, ఏపీ మంత్రులు నానిపై ఫైర్ అయ్యారు.
కేవలం రెమ్యునరేషన్ తగ్గుతుందనే బాధతోనే టికెట్ రేట్లను పెంచాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని నానిని విమర్శించారు. సెలబ్రిటీలంతా తమ రెమ్యునరేషన్ ను తగ్గించుకుంటే ప్రేక్షకులకు తక్కువ ధరలతి టికెట్లు విక్రయించొచ్చని మంత్రులు సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ గొడవలోకి హీరో సిద్ధార్థ్ ఎంటర్ అయ్యారు.
ఏపీ మంత్రులపై తనదైన రీతిలో మండిపడ్డారు సిద్ధార్థ్. ‘సినిమా ఖర్చు తగ్గించి, కస్టమర్స్‌కు డిస్కౌంట్ అందిస్తున్నామంటున్నారు మంత్రులు. మరి మేము ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. వాటిని కొంత మంది విలాసాలకు ఖర్చుపెడుతున్నారు. ఇంకొందరు అవినీతి రూపంలో రూ.లక్షల కోట్లు దోచుకుంటున్నారు. మీ విలాసాలు తగ్గించుకొని మాకు డిస్కౌంట్స్ ఇవ్వండి” అంటూ ట్వీట్ చేశారు.
కేవలం ఒక్కరిని టార్గెట్ చేస్తున్నట్లుగా కాకుండా.. కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిస్థితులను ఉద్దేశిస్తూ సిద్ధార్థ్ ఈ ట్వీట్ చేశారు. కానీ ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారో క్లియర్ గా అర్ధమవుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి సిద్ధార్థ్ ట్వీట్ పై ఏపీ మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!