Siddharth: కాస్త పద్ధతిగా ప్రశ్నలు అడగండి… సురేష్ కొండేటి పై సిద్ధార్థ్ కామెంట్స్!
October 4, 2023 / 02:10 PM IST
|Follow Us
కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు సిద్ధార్థ్ కు తెలుగులో కూడా ఎంతో మంచి క్రేజ్ ఉంది. తెలుగులో కూడా ఈయన బాయ్స్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా బొమ్మరిల్లు వంటి సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈమధ్య కాలంలో ఈయన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సినిమా అవకాశాలు కూడా రాలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈయన సొంత నిర్మాణంలో తానే నటుడిగా తెరకెక్కిన చిన్నా అనే సినిమా తెలుగులో అక్టోబర్ ఆరవ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
ఈ సినిమా ఇదివరకే తమిళంలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని తెలుగు కన్నడ మలయాళ భాషలలో కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సిద్ధార్థ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక సినీ సెలబ్రిటీలు ప్రెస్ మీట్ అంటే అక్కడ ప్రముఖ సినీ జర్నలిస్ట్ సురేష్ కొండేటి అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.
అయితే తాజాగా ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి హాజరైనటువంటి సిద్ధార్థ్ (Siddharth) సురేష్ కొండేటి తనని ప్రశ్న అడగడానికంటే ముందుగానే ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. మీరు కాస్త పద్ధతిగా ప్రశ్నలు అడిగితే బాగుంటుందని కొందరు ఈ విషయాన్ని మీకు చెప్పమని నాకు ఇంటర్నెట్లో మెసేజ్ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడితే సురేష్ కొండేటికీ వార్నింగ్ ఇంటర్నెట్ మొత్తం నీకు ఈ వార్నింగ్ ఇవ్వమని చెబుతోంది.
ఆయనని ప్రెస్ మీట్ కి పిలిస్తే పద్ధతిగా కూర్చొని పద్ధతిగా ప్రశ్నలు అడగమని చెప్పండి .ఆయన అడిగే వివాదాస్పదమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పనిలేదు అంటూ నాకు సలహా ఇచ్చారు. అయితే వారికి నేను ఒకటే సమాధానం చెప్పాను. ఆయన నా ఫ్రెండ్.. సురేష్ కొండేటికి ఇలాంటి ప్రశ్నలు అడిగే హక్కు ఉందయ్యా అంటూ సమాధానం చెప్పానని ఈ సందర్భంగా సిద్ధార్థ నవ్వుతూనే సురేష్ కొండేటికీ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.