Siddharth: సిద్ధూ కెరీర్‌లో ఈ సినిమా టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందా? గతంలో అయితే…

  • April 18, 2023 / 05:05 PM IST

శంకర్‌ – సిద్ధార్థ్‌ ఈ కాంబినేషన్‌ ఎంత పవర్‌ ఫుల్‌ అనేది మీకు తెలిసిన విషయమే. 20 ఏళ్ల క్రితం ఈ కాంబోలో వచ్చిన ‘బాయ్స్‌’ సినిమా అదిరిపోయే విజయం అందుకుంది. కుర్రకారు ఈ సినిమా కోసం ఊగిపోయారు. లవ్‌ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌, కుర్రాళ్లకు కావాల్సిన స్టఫ్‌ లాంటివి ఆ సినిమాలో పుష్కలంగా ఉంటాయి. అయితే ఆ సినిమా తర్వాత ఈ కాంబోలో సినిమా రాలేదు. ఇప్పుడు అంటే 20 ఏళ్ల తర్వాత మళ్లీ శంకర్‌ సినిమాలో సిద్ధార్థ్‌ నటిస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం అఫీషియల్‌గా పోస్టర్‌ రిలీజ్‌ చేసి అనౌన్స్‌ చేసింది.

పాన్‌ ఇండియా రేంజిలో ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఇండియన్ 2’ ఒకటి. కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. మధ్యలో వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు ఫుల్‌ జోష్‌లో చిత్రీకరిస్తున్నారు. అందులోనే సిద్ధార్థ్‌ నటిస్తున్నాడు. సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసి విషయం చెప్పింది టీమ్‌. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.

1996లో విడుదలైన ‘ఇండియన్’ /‘భారతీయుడు’ సినిమాకు ఇప్పుడు ‘ఇండియన్‌ 2’ సీక్వెల్‌గా వస్తోంది. ఆ సినిమాలోనే ఓ ప్రధాన పాత్రలో సిద్ధార్థ్‌ నటిస్తున్నాడు. ఆ రూపంలో 20 ఏళ్ల తర్వాత శంకర్‌ – సిద్ధార్థ్‌ను చూసే అవకాశం కలుగుతోంది. 2006లో విడుదలైన ‘బొమ్మరిల్లు’ తర్వాత సిద్దార్థ్‌కు సరైన విజయం ఇప్పటివరకూ రాలేదు. ఆ తర్వాత కూడా అనేక తెలుగు సినిమాల్లో నటించినా బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. దీంతో ఈ సినిమా సిద్ధార్థ్‌ కెరీర్‌కు చాలా అవసరం.

గతంలో సిద్ధార్థ్‌ (Siddharth) సహాయ పాత్రలు చేసిన సినిమాలు సరైన విజయం అందుకోకపోవడం గమనార్హం. ఎన్టీఆర్‌ ‘బాద్‌షా’, శర్వానంద్‌ ‘మహ సముద్రం’ ఇబ్బందికర ఫలితాలే అందుకున్నాయి. దీంతో ‘ఇండియన్‌ 2’ విజయం అతనికి కూడా కీలకం. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ కూడా నటిస్తున్నారు. వీరితో పాటు ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బాబీ సింహా కూడా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus