నాగ చైతన్యకు అన్నయ్య ఉన్నాడా..? అని కంగారు పడిపోకండి. నాగచైతన్య హీరోగా వచ్చిన ‘దడ’ సినిమాలో.. అన్నయ్య పాత్ర చేసాడు హీరో శ్రీరామ్. అంతకు ముందు హీరోగానూ నటించాడు. ‘రోజాపూలు’ అనే సినిమాతో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాడు. తరువాత ‘ఒకరికి ఒకరు’ అనే చిత్రంతో కూడా తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు. అయితే తరువాత మాత్రం హీరోగా సినిమాలు చేయలేదు. వెంకటేష్ తో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, రవితేజ ‘నిప్పు’, నితిన్ ‘లై’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు.
ఇక తన కెరీర్ ఎందుకు డల్ అయ్యింది అనే విషయం పై కొన్ని ఆసక్తి కరమైన సంగతుల్ని చెప్పుకొచ్చాడు శ్రీరామ్. ” ‘రోజాపూలు’ సినిమా అటు తమిళంలోను .. ఇటు తెలుగులోను బాగా ఆడింది. ఆ తరువాత తమిళంలో హీరోగా నేను బిజీ అయ్యాను. ఆ సమయంలోనే తెలుగులో ‘ఒకరికి ఒకరు’ సినిమా కూడా చేశాను. అది కూడా మ్యూజికల్ హిట్టయ్యి.. తెలుగు ప్రేక్షకులకు నన్ను మరింత దగ్గర చేసింది. అలా తమిళంతో పాటు తెలుగులోను నేను బిజీ అవుతానని అనుకుంటూ ఉండగానే నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. రెండు సంవత్సరాల పాటు నేను సినిమాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ ప్రమాదం తరువాత కెరియర్ మళ్ళీ మొదటికొచ్చింది. అంతకుముందు నాతో సినిమాలు చేస్తామంటూ తిరిగిన వాళ్ళెవ్వరూ నన్ను పట్టించుకోలేదు. దాంతో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!