పెద్ద ఫ్యామిలీ నుండీ వచ్చిన హీరోల్లో సుమంత్ ఒకరు. ఎంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. ఇప్పుడున్న కాంపిటిషన్లో నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. ట్యాలెంట్ కూడా ఉంటేనే ముందుకు వెళ్ళగలరు. లేదంటే త్వరగానే ఫేడౌట్ అయిపోతారు. విష్ణు వంటి హీరోలు అల్రెడీ ఫేడౌట్ అయిపోయారు. అయితే సుమంత్ కు మాత్రం ఇంకో అవకాశం ఇద్దాం అన్నట్టు ప్రేక్షకులు భావిస్తున్నట్టు ఉన్నారు. నిజానికి ఇతను చాలా పెద్ద హీరో అవుతాడని… అంతా అనుకున్నారు.
కానీ సరైన స్టోరీలు సెలెక్ట్ చేసుకోవడంలో తడబడాడ్డు. ఆ విషయాన్ని నేరుగా సుమంతే ఒప్పుకున్నాడు. తన మావయ్య నాగార్జునతో అనవసరంగా సినిమా చేసానని.. అందులో మావయ్య పై చెయ్యి చేసుకునే సన్నివేశాలు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయానని.. అలాగే తాతగారితో కూడా సినిమా చేసి తప్పుచేసానని తెలిపాడు. ‘నువ్వే కావాలి’ ‘దేశముదురు’ వంటి హిట్ సినిమాలు కూడా ఇతను వద్దనుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే సుమంత్… ముందు హీరోగా కొంచెం గ్యాప్ తీసుకుని కథాబలం ఉన్న పాత్రలు చేయడం బెటర్ అని అంతా అంటున్నారు.
అది కుదరని పక్షంలో మంచి కంటెంట్ ఉన్న ఓటిటి సినిమాలతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చినా మంచిదే అని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవి నిజమే అనిపిస్తుంది. గతేడాది సుమంత్ నటించిన ‘కపటదారి’ సినిమా మంచి టాక్ ను సంపాదించుకున్నా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఆ సినిమాకి ఓటిటి నుండీ మంచి ఆఫర్లు వచ్చాయి. అలా చేసినా బాగుండేది అంటూ అంతా అనుకున్నారు. ఈసారి మాత్రం సుమంత్ సరైన డెసిషన్ తీసుకున్నాడు.
అతని లేటెస్ట్ మూవీ ‘మళ్ళీ మొదలైంది’ నేరుగా జీ5 ఓటిటిలో రిలీజ్ అయ్యింది. సినిమాకి హిట్ టాక్ అయితే రాలేదు కానీ వ్యూయర్ షిప్ బాగానే నమోదవుతుంది. ఈ వీకెండ్ మొత్తం ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ చూసి ఎంజాయ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!