కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. వారసుడు సినిమాతో విజయ్ కోరిక నెరవేరుతుందో లేదో తెలియాల్సి ఉంది. తాజాగా వారసుడు మూవీ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో విజయ్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆడియో లాంఛ్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. విజయ్ మాట్లాడుతూ ఒక నటుడు 1990 సంవత్సరంలో తనకు పోటీగా వచ్చాడని అన్నారు.
కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి నాకు గట్టి పోటీ ఇచ్చాడని విజయ్ పేర్కొన్నారు. నేను ఎక్కడికి వెళితే ఆ వ్యక్తి కూడా అక్కడికి రావడం ప్రారంభించాడని ఆయన చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తిని బీట్ చేయడం కోసం నేను చాలా గట్టిగా ప్రయత్నించానని విజయ్ వెల్లడించడం గమనార్హం. ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నానని విజయ్ పేర్కొన్నారు. ఆ పోటీదారుని పేరు దళపతి విజయ్ అని ఆయన తెలిపారు. నాకు నేనే పోటీ అని ఆయన కామెంట్లు చేశారు.
నాతో నాకే పోటీ అంటూ విజయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. విజయ్ స్థాయిలో ప్రస్తుతం మరే స్టార్ హీరో డిమాండ్ చేయడం లేదు. విజయ్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కితే ఆయన రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం అయితే ఉండేది.
వారసుడు సినిమాపై విజయ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. బీస్ట్ సినిమా కమర్షియల్ గా ఆశించని స్థాయిలో సక్సెస్ సాధించని నేపథ్యంలో ఈ సినిమాపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నారు. విజయ్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?