వరలక్ష్మినే వివాహమాడతానంటున్న విశాల్!

  • April 18, 2016 / 08:42 AM IST

సీనియర్ నటుడు శరత్ కుమార్ తనయ వరలక్ష్మి మరియు యువ కథానాయకుడు విశాల్ ప్రేమలో మునిగితేలుతున్నారన్న విషయం చెన్నైలో చిన్నపిల్లోడికి కూడా తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇక వీళ్లిద్దరూ త్వరలోనే పీటలెక్కుతారనగా.. “నడిగర్ సంఘం” ఎలక్షన్స్ తెరపైకి రావడం, సదరు ఎలక్షన్స్ లో శరత్ కుమార్-విశాల్ లు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం జరిగిపోయాయి.

దాంతో.. వరలక్ష్మితో విశాల్ వివాహం జరగడం కష్టం అనుకొన్నారు అందరూ. అయితే.. ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఓ విలేఖరి “మీ పెళ్ళెప్పుడు?” అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాల్ “లక్ష్మి లాంటి అమ్మాయిని త్వరలోనే వివాహమాడతా” అన్నాడు. దాంతో.. ఇండైరెక్ట్ గా వరలక్ష్మితోనే తన వివాహం అని విశాల్ చెప్పినట్లుగా భావిస్తున్నారు అందరూ!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus