సత్యదేవ్‌ హీరోయిన్‌ ఈమెనే

  • January 11, 2021 / 12:00 PM IST

వైవిధ్యమైన నటన ఏ మాత్రం కొదవలేదు… కేవలం సరైన అవకాశం రావాలి.. అంతే అదరగొట్టేస్తాడు. ఆ మీరు అనుకుంటున్న హీరో గురించే ఈ మాట. ‘బ్లఫ్‌ మాస్టర్‌’ లాంటి కథ పడేసరికి తనేంటో నిరూపించుకున్న సత్యదేవ్‌ గురించే చెబుతున్నాం. అలాంటి సినిమా తర్వాత నాయకదర్శక ద్వయం సత్యదేవ్‌- గోపీగణేష్‌ మరోసారి కలుస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ‘గాడ్సే’ అనే పేరు పెట్టి ఆసక్తి రేపారు. అందులో నాయిక ఎంపిక విషయంలో అలాంటి ఆసక్తే కలిగించారు.

ఐశ్వర్య లక్ష్మి అనే మలయాళ భామను తొలిసారి టాలీవుడ్‌కి తీసుకొస్తున్నారు. ‘గాడ్సే’లో నాయిక ప్రాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. దీంతో బాగా వెతికి ఐశ్వర్యను ఎంచుకున్నారని చిత్రబృందం చెబుతోంది. ఐశ్వర్య కొచ్చిన్‌లో ఎంబీబీఎస్‌ చేసింది. మొన్నామధ్య శ్రీవిష్ణు సినిమా కోసం ఆమె పేరు ఎంచుకున్నా కొన్ని కారణాల వల్ల తీసుకోలేదు. ఇప్పుడు ‘గాడ్సే’తో తెలుగుకి వస్తోంది. అయితే వరుస అవకాశాలతో బిజీగా ఉండటం వల్లే శ్రీవిష్ణు సినిమాను ఐశ్వర్య వదులుకుందని వార్తలొచ్చాయి. అలాంటిది ఈ సినిమాకు డేట్స్‌ ఇవ్వడం గమనార్హం.

సినిమా పేరు చూసి నాథూరామ్‌ గాడ్సే కథను ఏమన్నా తీసుకొస్తున్నారా అని చాలామంది అనుకుంటున్నారు. దీనిపై దర్శకుడు ఇటీవల స్పందించాడు. నాథూరామ్‌ గాడ్సేకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. అంతేకాదు ‘ఆజాద్‌’లో నాగార్జున పోషించిన పాత్రకు దగ్గరగా ‘గాడ్సే’లో సత్యదేవ్‌ పాత్ర ఉంటుందట. సమాజం పెడచెవిన పెడుతున్న కీలకమైన అంశాల్ని సినిమాలో ప్రస్తావించబోతున్నారట.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus