Vijay Dearakonda: విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి సినిమా.. అదంతా ఫేక్..!

  • October 31, 2023 / 04:12 PM IST

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. పరశురామ్(బుజ్జి) ఈ చిత్రానికి దర్శకుడు. ‘గీత గోవిందం’ కాంబినేషన్ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్ లో ‘ ఐరనే వంచాలా ఏంటి?’ అనే డైలాగ్ ఎంత పెద్ద వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వాస్తవానికి ‘ఖుషి’ తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయాలి.

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించడానికి రెడీ అని నిర్మాత నాగ వంశీ ఈ ప్రాజెక్టుకి ఇచ్చిన హై అనేది అంతా ఇంతా కాదు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళలేదు. డిలే అవుతూ వస్తోంది. ఇంతలో ఈ ప్రాజెక్టు నుండీ హీరోయిన్ శ్రీలీల తప్పుకున్నట్టు టాక్ మొదలైంది.

షూటింగ్ ఆలస్యమవడం వల్లే ఆమె తప్పుకోవడంతో ‘ఏజెంట్’ ‘గాండీవధారి అర్జున’ సినిమాల హీరోయిన్ సాక్షి వైద్య ని ఎంపిక చేసుకున్నట్టు ఈ మధ్య గట్టిగా ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని చిత్ర బృందం నుండి అందుతున్న సమాచారం. ‘మా సినిమాలో శ్రీలీలే హీరోయిన్.. అదంతా ఫేక్ ప్రచారం’ అంటూ కొట్టిపారేశారు. బహుశా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో ఇంకా సినిమాలు రూపొందుతున్నాయి కాబట్టి.. వేరే ప్రాజెక్టుకి ఆమెను తీసుకున్నారేమో. !

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus