రవి తేజ “టచ్ చేసి చూడు”లో హీరోయిన్స్ రోల్స్ ఏమిటంటే?\

  • January 31, 2018 / 01:20 PM IST

టచ్ చేసి చూడు.. సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. టెంపర్ సినిమాలో పోలీస్ పాత్రను విభిన్నంగా డిజైన్ చేసిన వక్కంతం వంశీ ఈ సారి రవితేజ పవర్ ని దృష్టిలో పెట్టుకొని మరింత పవర్ ఫుల్ గా పాత్రను డిజైన్ చేశారు. అతను అందించిన కథతో విక్రమ్ సిరికొండ ఈ సినిమాని తెరకెక్కించారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ రెండూ సినిమాపై అంచనాలను పెంచాయి. ఫిబ్రవరి 2 న రిలీజ్ కానున్న ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఇందులో రవితేజ సరసన రాశిఖన్నా, సీరత్ కపూర్ నటిస్తున్నారు.

రాశిఖన్నా డ్యాన్సర్ గా ఈ సినిమాలో మెప్పించనుంది. ఇక సీరత్ కపూర్ రవితేజ ఫ్యామిలి ఫ్రెండ్ గా నటించింది. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ సాంగ్ థియేటర్ ని విజిల్స్ తో నింపనుందని సమాచారం. ఈ చిత్రంలో రవితేజ ఎనర్జిటిక్ నటనకు తోడు ఇంటర్వెల్ ఎపిసోడ్ అదరహో అనిపిస్తుందని టాక్. రాజా ది గ్రేట్ సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ టచ్ చేసి చూడు.. సినిమాతో మరో హిట్ సొంతం చేసుకుంటారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం టచ్ చేసి చూడు సినిమా ప్రమోషన్లో రవితేజ  పాల్గొంటూనే  కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమాని చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus