Heroines: ఆ హీరోయిన్స్ జీవితాంతం సెంటిల్ మెంట్ చూసుకున్నారుగా!

  • May 16, 2023 / 08:07 PM IST

కొందరు నటీమణులు తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్ గా ఉంచుతారు. ఇక సినీ రంగంలో నటులు తోటి నటుల్ని, బిజినెస్ పర్సన్స్ ని పెళ్లి చేసుకోవడం చాలా మామూలు. అయితే కొందరు నటీమణులు మాత్రం నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయ నాయకులని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లెవరో చూద్దాం..

1) రాధికా కుమారస్వామి

కన్నడ నటీమణి రాధిక.. మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామిని 2006 లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు షమిక స్వామి అనే కుమార్తె ఉంది. ఈమె కన్నడ తో పాటు పలు తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించారు. రాధిక 14ఏళ్ల వయస్సులో సినీ పరిశ్రమలోకి వచ్చింది. అయితే, కుమారస్వామి రాధికకు రెండవ భర్త, ఆమె మొదటి భర్త గుండెపోటుతో మరణించాడు.

2) స్వరా భాస్కర్

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఈ వార్తను స్వయంగా స్వర భాస్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ధృవీకరించారు. సమాజ్ వాదీ పార్టీ నేత ఫహద్ జిరార్ అహ్మద్‌ను ఆమె సీక్రెట్‌గా వివాహం చేసుకుంది.

3) అయేషా టకియా

తెలుగులో పలు చిత్రాల్లో నటించిన అయేషా టాకియా, 2009లో తన బాయ్‌ఫ్రెండ్, మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు అబూ అసిమ్ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతడు సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు. ఈ దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు.

4) నవనీత్ కౌర్ రానా

పలు తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నవనీత్ కౌర్ ఆమె ఫిబ్రవరి 3, 2011న మహారాష్ట్రలో స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాను సామూహిక వివాహం చేసుకుంది. రవి రాణా ప్రస్తుతం విదర్భ ప్రాంతంలోని అమరావతి జిల్లాలోని బద్నేరా (విధానసభ స్థానం) నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. నవనీత్ కౌర్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.

5) పరిణీతి చోప్ర

బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా, AAP లీడర్ రాఘవ్ చద్దా నిశ్చితార్థం మే 13 (శనివారం) జరిగింది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus