మళ్లీ మళ్లీ కలిసి నటించిన కథానాయికలు

  • December 1, 2017 / 01:20 PM IST

కాంబినేషన్స్ అంటే మనకి మొదట గుర్తొచ్చేది.. హీరో- డైరెక్టర్, హీరో- హీరోయిన్, డైరెక్టర్ – మ్యూజిక్ డైరెక్టర్.. ఇలాంటి వాటికి బాగా క్రేజ్ ఉంటుంది…. కానీ ఎప్పుడు గమనించని ఒక కాంబినేషన్… హీరోయిన్స్ కాంబినేషన్. తెలుగు సినిమాల్లో కొన్ని హీరోయిన్ కాంబినేషన్స్ రిపీట్ అయ్యాయి… అంటే ఇద్దరు హీరోయిన్స్ మళ్లీ మళ్లీ కలిసి నటించారు. కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఒకేసారి స్క్రీన్ పై కనిపిస్తే… మరికొన్ని సినిమాల్లో ఇప్పుడు ఒకరు.. ఫ్లాష్ బ్యాక్ లో ఒకరు కనిపిస్తారు. ఎలా కనిపించినా ఆ హీరోయిన్స్ రిపీట్ అయిన నేటి చిత్రాలపై ఫోకస్..

సమంత & నిత్యా మీనన్ అమాయకంగా నటించి ఆకర్షించే క్యూట్ బ్యూటీ సమంత, అభినయంతో ఆకట్టుకునే నిత్యా మీనన్ S/O సత్యమూర్తి, జనతా గ్యారేజ్, అదిరింది, 24 సినిమాల్లో కలిసి నటించి ఉమ్మడిగా హిట్ అందుకున్నారు.

కాజల్ అగర్వాల్ & తాప్సి టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్, బబ్లీ బ్యూటీ తాప్సి మిస్టర్ పర్ఫెక్ట్, వీర లో నటించారు. వీటిలో ఒకటి హిట్ కాగా మరొకటి ఫ్లాప్ అయింది.

సమంత & ప్రణీత అత్తారింటికి దారేది లో సమంత & ప్రణీతలు హీరోయిన్స్ గా నటించారు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ రభస సినిమాలో కనిపించినప్పటికీ సక్సస్ కనిపించలేదు.

కాజల్ అగర్వాల్ & శ్రద్ధా దాస్ ఒకరికొకరు పోటీపడి నటించగల కాజల్ అగర్వాల్, శ్రద్ధా దాస్ లు తొలిసారి ఆర్య 2 లో కనిపించారు . ఆ తర్వాత డార్లింగ్ లో విభిన్న పాత్రలు పోషించారు. అయితే ఈ రెండు అనుకున్నంత హిట్ కాలేకపోయింది.

కాజల్ అగర్వాల్ & సమంత తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్స్ గా పేరుతెచ్చుకున్న కాజల్ అగర్వాల్, సమంత బృందావనం, బ్రహ్మోత్సవం, అదిరింది చిత్రాల్లో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు.

శ్రియ & జెనీలియా నా అల్లుడు, సుభాష్ చంద్ర బోస్ సినిమాలు రెండూ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకే అందులో హీరోయిన్స్ గా నటించిన శ్రియ & జెనీలియా కాంబినేషన్ అన్ లక్కీ కాంబినేషన్ గా పేరు తెచ్చుకుంది.

రిచా & అనుష్క హైట్, వెయిట్ లోనే కాదు అందం అభినయంలోనూ దాదాపు సమానంగా ఉండే రిచా & అనుష్క లు కలిసి మొదటి నాగవల్లిలో మెరిశారు. అది నిరాశపరిచిన మళ్లీ ఇదే కాంబినేషన్ మిర్చిలో కనిపించి మైమరిపించింది.

హన్సిక & శృతి హాసన్ తెలుగులో ఓ మై ఫ్రెండ్, తమిళంలో విజయ్ “పులి” సినిమాలో హన్సిక & శృతి హాసన్ కలిసి నటించారు. ఇద్దరు కలిసి కష్టపడినా ఈ చిత్రాలను విజయతీరానికి చేర్చలేకపోయారు.

సోనాలి బింద్రే & ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే & ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ఇంద్ర. ఈ చిత్రంతో వీరికి మంచి పేరొచ్చింది. తర్వాత వీరిద్దరూ పల్నాటి బ్రహ్మనాయుడులో నటించారు. అయితే అది హిట్ కాలేకపోయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus